Asianet News TeluguAsianet News Telugu

వారణాసిలో నామినేషన్లు వేసిన నిజామాబాద్ పసుపు రైతులు ( వీడియో)

ప్రధాన మంత్రి పోటీ చేస్తున్న వారణాసి ఎంపీ స్థానం నుండి  నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు  సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు

turmeric farmers files nomination in varanasi
Author
Hyderabad, First Published Apr 29, 2019, 11:52 AM IST

వారణాసి: ప్రధాన మంత్రి పోటీ చేస్తున్న వారణాసి ఎంపీ స్థానం నుండి  నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు  సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని , ఎర్రజొన్న  రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతులు కొంత కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

 

"

ఈ నెల 11వ తేదీన జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో సుమారు 178 మంది రైతులు పోటీ చేశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు వారణాసిలో నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా నుండి 50 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసేందుకు రెండు రోజుల క్రితం వెళ్లారు.

వారణాసికి చేరుకొన్న తమను స్థానికులు కొంత ఇబ్బంది పెట్టారనే రైతులు ఆరోపించారు. ఇప్పటివరకు 25 మంది రైతులు తమ నామినేషన్లను దాఖలు చేశారు.  గడువు ముగిసే సమయానికి  మరో 25 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 

నిజామాబాద్ రైతులకు  మద్దతుగా తమిళనాడు రైతులు  కూడ  వారణాసిలో  నామినేషన్లు దాఖలు చేయనున్నారు.  తమ డిమాండ్‌ను  దేశ వ్యాప్తంగా తెలిపేందుకు గాను నిజామాబాద్ రైతులు  వారణాసిలో నామినేషన్లు దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

మోడీపై పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు

రైతులకు షాక్: నిజామాబాద్ ఎన్నికపై తేల్చేసిన హైకోర్టు

నిజామాబాద్ సీట్లో ఈవీఎంలే వాడుతాం: ఈసీ

ఇందూరు ఫైట్: బ్యాలెట్‌ పేపర్‌కే రైతుల పట్టు

నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

దిగిరాని రైతులు: కవిత సహా ప్రధాన పార్టీల అభ్యర్థులకు తిప్పలే

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు

కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)

Follow Us:
Download App:
  • android
  • ios