MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • Rain Alert: ఇక కాస్కోండి.. బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం, వ‌చ్చే 2 రోజులు భారీ వ‌ర్షాలు

Rain Alert: ఇక కాస్కోండి.. బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం, వ‌చ్చే 2 రోజులు భారీ వ‌ర్షాలు

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప‌పీడ‌నంతో తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 16 2026, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరింత బలపడే అవకాశం
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరింత బలపడే అవకాశం

వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. పలు చోట్ల ఆకాశం మేఘావృతమై వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు
Image Credit : ANI

ఏపీలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వాతావరణం మరింత చురుగ్గా మారనుంది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు సముద్ర కార్యకలాపాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

35
సోమవారం ఏపీకి వర్ష సూచన
Image Credit : ANI

సోమవారం ఏపీకి వర్ష సూచన

సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, చిత్తూరు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

45
మంగళవారం ఉత్తరాంధ్రపై ప్రభావం
Image Credit : Asianet_News to Asianet

మంగళవారం ఉత్తరాంధ్రపై ప్రభావం

మంగళవారం కూడా వాతావరణ వ్యవస్థ ప్రభావం కొనసాగనుంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరం అని హెచ్చరించారు.

55
తెలంగాణలోనూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Image Credit : Asianet News

తెలంగాణలోనూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

అల్పపీడనం ప్రభావం తెలంగాణపైనా కనిపించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాల నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కిందకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. రైతులు కూడా పొలాల్లో పనిచేసే సమయంలో వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
మురికి కాలువ కోసం భూమి తవ్వుతుండ‌గా అద్భుతం.. బ‌య‌ట‌ప‌డ్డ‌ రూ. 98 కోట్ల నిధి
Recommended image2
Facts: వ‌ర్షం ప‌డితే క‌రెంట్ ఎందుకు పోతుంది.? ఎప్పుడైనా ఆలోచించారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved