MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Telangana
  • Weather Update: పసిఫిక్ నుంచి అరేబియా దాకా సముద్రంలో తుపాన్లు.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

Weather Update: పసిఫిక్ నుంచి అరేబియా దాకా సముద్రంలో తుపాన్లు.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

IMD Weather Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపానుల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాముందని పలు ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 16 2026, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏపీ, తెలంగాణ వాతావరణ అప్‌డేట్
Image Credit : Gemini

ఏపీ, తెలంగాణ వాతావరణ అప్‌డేట్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గాలుల వేగం బాగా పుంజుకుంటోంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఈ వాతావరణ మార్పుల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు వుంటాయని తెలిపింది. ఆదివారంతో పాటు రాబోయే వారంలో ఏపీ, తెలంగాణలలో వెదర్ ఎలా వుంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బంగాళాఖాతంలో అల్పపీడనంతో వర్షాలు
Image Credit : Chatgpt

బంగాళాఖాతంలో అల్పపీడనంతో వర్షాలు

బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, అల్పపీడన పరిస్థితులు ఉన్నప్పటికీ మన రాష్ట్రాలపై దాని ప్రభావం చాలా తక్కువగా ఉండబోతోంది. ఈ అల్పపీడనం ఇవాళ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల వైపు తీరం దాటే అవకాశం ఉండటంతో, భయంకరమైన వర్షాలన్నీ అక్కడే కురుస్తాయి. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష ముప్పు లేదు. కానీ, దీని ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల్లో చల్లటి బలమైన గాలులు వీస్తాయి. అక్కడక్కడ వర్షాలే పడతాయి. కాబట్టి సండే ప్రయాణాలు చేసేవారికి, టూరిస్ట్ ప్లేసులను విజిట్ చేసేవారికి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

Related Articles

Related image1
IND vs SL: అరంగేట్రంలోనే అదరగొట్టిన పడిక్కల్.. 24 ఏళ్ల గంగూలీ రికార్డు బ్రేక్
Related image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
36
ఎల్‌నినో దెబ్బకు బలహీనపడ్డ రుతుపవనాలు.. వర్షాల పరిస్థితి ఇది
Image Credit : Gemini

ఎల్‌నినో దెబ్బకు బలహీనపడ్డ రుతుపవనాలు.. వర్షాల పరిస్థితి ఇది

రుతుపవనాల కాలం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడానికి ప్రధాన కారణం 'ఎల్‌నినో' బలం పెరగడమే. దీనివల్ల నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్రంగా బలహీనపడ్డాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు స్పష్టం చేశాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 16 నుంచి 21 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాం, తెలంగాణలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో భారీ వర్షాలు కురుసే అవకాశాలు కూడా లేకపోలేదు.

46
ఉపగ్రహ డేటా ఏం చెప్తోంది? ఉష్ణోగ్రతలు, తేమ వివరాలు!
Image Credit : Gemini

ఉపగ్రహ డేటా ఏం చెప్తోంది? ఉష్ణోగ్రతలు, తేమ వివరాలు!

వివిధ శాటిలైట్ డేటాని గమనిస్తే, ఏపీ, తెలంగాణ ఆకాశంలో రోజంతా మేఘాలు పరుగులు తీస్తూ కనిపిస్తాయి.

తెలంగాణ వాతావరణం: ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మధ్య, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్‌లలో పొడి వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. తేమ ఉత్తర తెలంగాణలో 75%, మిగతా భాగాల్లో 52% వరకు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ వాతావరణం: ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల జల్లులు పడవచ్చు. మిగతా కోస్తాంధ్ర, రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. తేమ ఉత్తరాంధ్రలో 64%, మిగతా ఏపీలో 41%గా నమోదుకానుంది. రెండు రాష్ట్రాల్లోనూ గంటకు 40 నుండి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

56
రైతన్నలకు అలర్ట్.. గాల్లో తేమ లేక ఎండిపోతున్న పంటలు
Image Credit : Getty

రైతన్నలకు అలర్ట్.. గాల్లో తేమ లేక ఎండిపోతున్న పంటలు

ఈ వాతావరణ పరిస్థితులు రైతన్నలకు కొంచెం ఆందోళన కలిగించే విషయమే. నైరుతి రుతుపవనాల వల్ల గాలులు వీస్తున్నప్పటికీ, ఆ గాలిలో తగినంత తేమ లేకపోవడం వల్ల వానలు పడటం లేదు. దానికి తోడు సాధారణం కంటే ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతున్నాయి. సముద్రాల్లో వేడి వాతావరణం పెరుగుతున్నా, మన ప్రాంతాలపై ప్రభావం చూపే బలమైన అల్పపీడనాలు ఏర్పడటం లేదు. వర్షాలు సరిగా పడకపోవడం వల్ల పంటలకు, మొక్కలకు నీటి ఎద్దడి రాకుండా కొద్దిగా ఎక్కువ నీరు అందించాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు పరిస్థితిని బట్టి తగిన ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం.

66
గ్లోబల్ వెదర్ సీన్: భారీ వర్షాలు ఎందుకు పడట్లేదు?
Image Credit : Getty

గ్లోబల్ వెదర్ సీన్: భారీ వర్షాలు ఎందుకు పడట్లేదు?

ఆసియా ఖండం వ్యాప్తంగా వాతావరణాన్ని పరిశీలిస్తే, పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రంగా ఉన్న 'లాలా' తుపాను కొంత బలహీనపడింది. అయినప్పటికీ దాని సుడిగాలులు గంటకు 95 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. అక్కడ మరో 5 అల్పపీడనాలు ఉన్నాయి. ఇటు అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడుతుండటంతో అది అల్పపీడనంగా మారే అవకాశం లేకుండా పోయింది.

భూమధ్యరేఖ వద్ద మేఘాల సాంద్రత తగ్గడం, అంటార్కిటికా నుంచి చల్లని గాలులు వస్తున్నప్పటికీ గాలిలో తేమ తగ్గిపోవడం వల్ల వర్షపాతం పడిపోయింది. సముద్రంలో ఏవైనా బలమైన తుపాన్లు లేదా భారీ అల్పపీడనాలు రూపుదిద్దుకుంటే తప్ప, ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాల నుంచి అత్యంత భారీ వర్షాలను ఆశించలేమని నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
Recommended image2
Now Playing
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
Recommended image3
తెలంగాణలో 22A భూముల వివాదం.. అసలేంటీ సెక్షన్? ఎందుకీ గందరగోళం? పరిష్కారం ఏంటి.?
Related Stories
Recommended image1
IND vs SL: అరంగేట్రంలోనే అదరగొట్టిన పడిక్కల్.. 24 ఏళ్ల గంగూలీ రికార్డు బ్రేక్
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved