హైదరాబాద్: హైద్రాబాద్ కామాటీపుర పోలీసి‌స్టేషన్ పరిధిలోని గొల్లకిడికిలో మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటనపై విచారణకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు.

గొల్లకిడికి ప్రాంతంలో నాలుగేళ్లుగా   మైనర్ బాలికపై 11 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ  ఫోన్‌లో హైద్రాబాద్ సీపీతో ఫోన్‌‌లో మాట్లాడారు.  

ఈ విషయమై త్వరగా విచారణను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని  హోం మంత్రి కోరారు.

బాధితురాలికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడ మంత్రి ఆదేశించారు. మరో వైపు బాధి కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించాలని  కూడ ఆయన కోరారు.
 

సంబంధిత వార్తలు

రెండేళ్లుగా అమ్మాయిపై 11 మంది రేప్: నిందితులు వీరే..

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్: వీడియోలు తీసి 4 ఏళ్లుగా అత్యాచారం (వీడియో)