హైదరాబాద్: మైనర్‌ బాలికపై 11 మంది కామాంధులు నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.అత్యాచారం చేసే సమయంలో  తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి బాధితురాలిపై రేప్‌కు పాల్పడుతున్నారు.  

ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు కామాటీపుర పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.కామాటీపుర పోలీస్‌స్ట్‌షన్ పరిధిలోని గొల్లకిడికిలో నివాసం ఉంటున్న మైనర్ బాలికపై 11 మంది  కామాంధులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేశారు.

అత్యాచారం చేసే సమయంలో నిందితులు మొబైల్ ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని  బెదిరించి నాలుగేళ్లుగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది.

కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు కామాటీపుర పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

"