పోర్న్ సైట్లకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ సైట్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు గూగుల్ కు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: అశ్లీల వెబ్‌సైట్లను హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు గూగుల్ సంస్థను ఆదేశించింది.
తన ఫేస్‌బుక్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్‌సైట్లలో పెట్టారని ఓ యువతి గూగుల్‌కు ఫిర్యాదు చేసింది.అయితే ఈ విషయంలో గూగుల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది.
తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై హైకోర్టు మంగళవారం నాడు విచారించింది.ఆశ్లీల వెబ్‌సైట్ల పూర్తి వివరాలను అందించాలని గూగుల్ ను హైకోర్టు ఆదేశించింది.ఆశ్లీల వెబ్‌సైట్లకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని కూడ కోర్టు తేల్చి చెప్పింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 20, 2019, 2:59 PM IST