తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in/‌లో చెక్ చేసుకోవచ్చు. ఎంసెట్-2023 అడ్మిషన్ ప్రక్రియను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టుగా సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో స‌న‌పాల అనిరుధ్‌(విశాఖ‌ప‌ట్ట‌ణం) తొలి ర్యాంకు సాధించారు.  మ‌ణింధ‌ర్ రెడ్డి(గుంటూరు) రెండో ర్యాంకు, ఉమేశ్ వ‌రుణ్‌(నందిగామ‌) మూడో ర్యాంకు, అభిణిత్ మ‌జేటి(హైద‌రాబాద్) నాలుగో ర్యాంకు, పొన్నతోటి ప్ర‌మోద్ కుమార్ రెడ్డి(తాడిప‌త్రి) ఐదో ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్‌, ఫార్మా స్ట్రీమ్‌లో.. బి సత్యరాజ్ జశ్వంత్ (తూర్పు గోదావరి) ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఎన్ వెంకట్ తేజ (చీరాల) రెండో ర్యాంకు, ఎస్ లక్ష్మి (హైదరాబాద్) మూడో ర్యాంకు, డి కార్తికేయ రెడ్డి (తెనాలి) నాలుగో ర్యాంకు, బోర వరుణ్ చక్రవర్తి(శ్రీకాకుళం) ఐదో ర్యాంకు సొంతం చేసుకున్నారు. 

-అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి తెలంగాణ నుంచి 94,589 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 20,743 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 10, 11 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించడం జరిగింది. మొత్తంగా 1,01,544 పరీక్ష రాయడం జరిగింది. ఇందులో 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తంగా 86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అబ్బాయిల్లో 84 శాతం, అమ్మాయిల్లో 87 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 

-ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 1,53,890, ఏపీ  నుంచి 51,461 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 12, 13,14 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించడం జరిగింది. 1,95,275 మంది పరీక్ష రాయగా.. 1,56,879 మంది అర్హత సాధించారు. మొత్తంగా 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అబ్బాయిల్లో 79 శాతం, అమ్మాయిల్లో 82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 

ఇక, తెలంగాణలో ఎంసెట్ - 2023 పరీక్షను ఈ నెల 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ పరీక్షకు మూడు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 

ఫలితాలు చెక్ చేసుకునే విధానం..
- ఈ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవడానికి విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో సిద్ధంగా ఉండాలి. 
- టీఎస్ ఎంసెట్ అధికారిక వెబ్ సైట్  https://eamcet.tsche.ac.in/‌ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో టీఎస్ ఎంసెట్ 2023 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి. 
- తదుపరి దశలో విద్యార్థులు లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- వివరాలు సమర్పించిన తర్వాత టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఫలితాలను భవిష్యత్తు అవసరం కోసం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.