సవాళ్ల ఫలితం: రేవంత్, హరీష్, ఒంటేరు, రేవూరిలకు ఈసీ నోటీసులు

ఎన్నికల సభల్లో ప్రత్యర్థులపై  పరుష పదజాలంతో  తీవ్రమైన విమర్శలు చేసిన టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌ నేతలకు ఈసీ షాకిచ్చింది.

Telangana CEO issues notices to trs, congress, and tdp leaders


హైదరాబాద్:  ఎన్నికల సభల్లో ప్రత్యర్థులపై  పరుష పదజాలంతో  తీవ్రమైన విమర్శలు చేసిన టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌ నేతలకు ఈసీ షాకిచ్చింది. 48 గంటల్లోపుగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మంత్రి హరీష్‌రావుతో పాటు  రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డిలకు కూడ ఈసీ నోటీసులను శుక్రవారం నాడు జారీ చేసింది.

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు  అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు  ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై  48 గంటల్లోపుగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు  రేవూరి ప్రకాష్‌ రెడ్డి‌లకు ఈసీ నోటీసులు ఇచ్చింది.

టీఆర్ఎస్‌ నేతలతో పాటు  కేసీఆర్‌ను తీవ్రమైన పదజాలంతో దూషించినందుకు ఈసీ నోటీసులు  జారీ చేసింది. 48 గంటల్లో ఈ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది.
 

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీష్‌కు ట్రబుల్స్: టీడీపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్

ఆధారాలున్నాయి: హరీష్ పై మరోసారి వంటేరు సంచలనం

పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios