ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు ఎస్ఐల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 


గజ్వేల్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు ఎస్ఐల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 3వ తేది నాటికి ఈ విషయమై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, పోలీసు శాఖను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలీసులు అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత బొల్లారం ఎల్లయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల అధికారులను, రాష్ట్ర పోలీసు శాఖను వివరణ కోరింది.

హైకోర్టు చీఫ్ జస్టిస్ టీ.బీ. రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్టులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడ ఇదే స్థానం నుండి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు.

కేసీఆర్ పోటీ చేస్తున్నందున అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.గత మూడేళ్ల నుండి ఈ ఇద్దరు ఎస్ఐలు అదే ప్రాంతంలో పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. 

అధికార పార్టీకి అనుకూలంగా ఇతర పార్టీ నేతలను, కార్యకర్తలను ఈ ఇద్దరు ఎస్ఐలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం సోమవారం నాటికి తమ వివరణను ఇవ్వాలని ఎన్నికల సంఘం అధికారులను, పోలీసు శాఖను ఆదేశించింది.

సంబంధిత వార్తలు

గజ్వేల్ నుండి కేసీఆర్ నామినేషన్ దాఖలు

నేను ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు: కేసీఆర్

అదే సెంటిమెంట్: నామినేషన్ పత్రానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు

తిరుగులేని ముహుర్తంలో కేసీఆర్ నామినేషన్: ఇక రాజయోగమేనా

కేసీఆర్ కోట: గజ్వెల్ సీటు చరిత్ర, సెంటి మెంట్ ఇదీ....

తిరుగులేని ముహూర్తం: నామినేషన్ వేసి...కేసీఆర్ ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారా..?

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత
ఆ 12 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే: ఉత్తమ్‌ను ఢీకొనేది అతనే

గ్రేటర్‌లో సగం సీట్లు మనవే: కేసీఆర్, ఆ స్థానాల్లో ఊహించని పేర్లు

ఆ 14 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు కేసీఆర్ కసరత్తు, అదృష్టం ఎవరిదో?

సెంటిమెంట్: అమావాస్య రోజున పోలింగ్, కేసీఆర్‌కు కలిసొచ్చేనా?

తప్పిన కేసీఆర్ లెక్క.....ఎన్నికల్లో కనిపించని లక్కీ నంబర్

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిఈసీ
ఓటుకు నోటులో ఉంది నువ్వు కాదా: చంద్రబాబుకు కేసీఆర్ సవాల్