సిద్దిపేట: ఈ ఎన్నికల్లో  వంద సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందని  అపద్ధర్మ సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. కోనాయిపల్లి వెంకటేశ్వర్వస్వామి ఆశీస్సులు పొంది తాను ఏ యుద్ధంలో పాల్గొన్న ఏనాడూ ఓటమి పాలు కాలేదన్నారు.

బుధవారం నాడు టీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్ కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో  నామినేషన్ పత్రాలను  ఉంచి పూజలు నిర్వహించారు. ఈ పూజల  అనంతరం కేసీఆర్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.

వెంకటేశ్వరస్వామి దీవెనలను  పొందిన తర్వాత తాను ఏనాడూ కూడ ఓడిపోలేదన్నారు. ఆనాడు డిప్యూటీ స్పీకర్‌గా  తాను  మీ వద్ద ఆశీస్సులను పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు  మీ అనుమతి పొందిన తర్వాతే  రాజీనామా చేసినట్టు ప్రస్తావించారు. తెలంగాణ కోసం  ఆనాడు తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించిన విషయాన్ని  కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే సమస్యలను  అతి తక్కువ కాలంలోనే పూర్తి చేసినట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు  ద్వారా  వెంకన్న కాళ్లను అభిషేకం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.  అభివృద్ధిలో తెలంగాణను అగ్రభాగాన నిలిపినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులు దేశంలోనే సంపన్నులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు. రైతులు అప్పులు లేకుండా ఉండాలనేదే తన అభిమతమన్నారు

ఈ ఎన్నికల్లో  వంద సీట్లను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమాను  వ్యక్తం చేశారు.  హరీష్‌రావును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని  ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అదే సెంటిమెంట్: నామినేషన్ పత్రానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు

తిరుగులేని ముహుర్తంలో కేసీఆర్ నామినేషన్: ఇక రాజయోగమేనా

కేసీఆర్ కోట: గజ్వెల్ సీటు చరిత్ర, సెంటి మెంట్ ఇదీ....

తిరుగులేని ముహూర్తం: నామినేషన్ వేసి...కేసీఆర్ ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారా..?

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత
ఆ 12 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే: ఉత్తమ్‌ను ఢీకొనేది అతనే

గ్రేటర్‌లో సగం సీట్లు మనవే: కేసీఆర్, ఆ స్థానాల్లో ఊహించని పేర్లు

ఆ 14 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు కేసీఆర్ కసరత్తు, అదృష్టం ఎవరిదో?

సెంటిమెంట్: అమావాస్య రోజున పోలింగ్, కేసీఆర్‌కు కలిసొచ్చేనా?

తప్పిన కేసీఆర్ లెక్క.....ఎన్నికల్లో కనిపించని లక్కీ నంబర్

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిఈసీ
ఓటుకు నోటులో ఉంది నువ్వు కాదా: చంద్రబాబుకు కేసీఆర్ సవాల్