టీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్  తిరుగులేని  ముహుర్తంలో  నామినేషన్ దాఖలు చేయనున్నారు.


హైదరాబాద్: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తిరుగులేని ముహుర్తంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 14వ తేదీన వెంకటేశ్వరస్వామి జన్మనక్షత్రంలో కేసీఆర్ నామినేషన్ వేస్తారు. కేసీఆర్ నామినేషన్ వేసే ముందు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు చేస్తారు. ఆలయంలోనే నామినేషన్ పత్రాలపై కేసీఆర్ సంతకం చేస్తారు. 

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నందున కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం నాడు పరిశీలించారు.

నవంబర్ 14వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మకర లగ్నం ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటన్నర నుండి ర2.50 నిమిషాల వరకు కుంభ లగ్నం.

ఈ రెండు ముహుర్తాలు చాలా గొప్పవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రెండు ముహుర్తాల్లో ఎప్పుడూ నామినేషన్లు దాఖలు చేసినా కూడ రాజ యోగం ఉంటుందంటున్నారు. నవంబర్ 14 వ తేదీన కేసీఆర్, హరీష్ రావులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

1985 నుండి సిద్దిపేట కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత నామినేషన్ దాఖలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేష్ దాఖలు చేసే ముందు కేసీఆర్ పూజలు నిర్వహిస్తారు. 1985 నుండి కేసీఆర్ ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.

సంబంధత వార్తలు

కేసీఆర్ కోట: గజ్వెల్ సీటు చరిత్ర, సెంటి మెంట్ ఇదీ....

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత
ఆ 12 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే: ఉత్తమ్‌ను ఢీకొనేది అతనే

గ్రేటర్‌లో సగం సీట్లు మనవే: కేసీఆర్, ఆ స్థానాల్లో ఊహించని పేర్లు

ఆ 14 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు కేసీఆర్ కసరత్తు, అదృష్టం ఎవరిదో?

సెంటిమెంట్: అమావాస్య రోజున పోలింగ్, కేసీఆర్‌కు కలిసొచ్చేనా?

తప్పిన కేసీఆర్ లెక్క.....ఎన్నికల్లో కనిపించని లక్కీ నంబర్

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిఈసీ
ఓటుకు నోటులో ఉంది నువ్వు కాదా: చంద్రబాబుకు కేసీఆర్ సవాల్