Asianet News TeluguAsianet News Telugu

ఆ 12 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే: ఉత్తమ్‌ను ఢీకొనేది అతనే

మిగిలిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూరై్ంది.ఈ స్థానాల్లో కూడ  టీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 

telagana assembly elections: here is 12 trs candidates list
Author
Hyderabad, First Published Nov 12, 2018, 3:55 PM IST


హైదరాబాద్: మిగిలిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూరై్ంది.ఈ స్థానాల్లో కూడ  టీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.  అయితే  వీరికి ఇంకా బీ ఫారాలను అందించాల్సి ఉంది.  మహాకూటమి(ప్రజా కూటమి) అభ్యర్థుల జాబితా ఫైనల్ అయిన తర్వాత ఈ 12 స్థానాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం లేకపోలేదని సమాచారం.

ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. అదే రోజుల 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత మరో  రెండు స్థానాలకు కూడ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తంగా 107 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం నాడు రాత్రి తెలంగాణ భవన్ లో‌ 107 మంది అభ్యర్థులకు భీ ఫారాలు కూడ అందించారు.

నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుండి ప్రారంభమైన నేపథ్యంలో  తమ వీలును బట్టి టీఆర్ఎస్ నేతలు భీ ఫారాలతో  తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.ఇదిలా ఉంటే ఇంకా అభ్యర్థులు ప్రకటించని స్థానాల విషయంలో టీఆర్ఎస్‌ ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది.

అయితే వీరిలో కొందరకి టీఆర్ఎస్ నాయకత్వం ప్రచారం చేసుకోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో  వారంతా ఆయా నియోజకవర్గాల్లో  ప్రచారాన్ని కూడ  ప్రారంభించారు. మరో వైపు ఈ పరిణామాల నేపథ్యంలో  మూడు నాలుగు సీట్లలో మినహా ఇతర స్థానాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.

ఖైరతాబాద్‌ నుండి మాజీమంత్రి దానం నాగేందర్‌ వైపే కేసీఆర్ మొగ్గు చూపారని సమాచారం. దీంతో మన్నె గోవర్ధన్ రెడ్డి వర్గీయులు  సోమవారం నాడు టీఆర్ఎస్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు. 

చొప్పదండి స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శోభ కంటే  టీఆర్ఎస్ డాక్టర్ రవికుమార్ మెరుగైన అభ్యర్థిగా  టీఆర్ఎస్‌ చీఫ్ భావిస్తున్నట్టు సమాచారం.  ముషీరాబాద్‌ స్థానంలో ముఠా గోపాల్‌ వైపే కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు. 

ఈ స్థానం కోసం హోమ్ మంత్రి నాయిని నర్సింహరెడ్డి  తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కోసం పట్టుబడుతున్నాడు. కానీ ముఠా గోపాల్‌ సరైన అభ్యర్థిగా టీఆర్ఎస్  నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. 

గోషామహల్ నుండి ప్రేమ్‌సింగ్ రాథోడ్‌‌ను అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉంది. మేడ్చల్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బదులుగా మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డిని బరిలోకి దింపారు. ఆదివారం నాడు టీఆర్ఎస్ అభ్యర్థుల సమావేశానికి సుధీర్ రెడ్డి హాజరైనప్పటికీ ఆయనను సమావేశం మందిరంలోకి వెళ్లలేదు. ఎంపీ మల్లారెడ్డి మాత్రమే సమావేశ మందిరంలోకి  వెళ్లారు.

హుజూర్‌నగర్ నుండి  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై  ఎన్ఆర్ఐ శానంపూడి సైదిరెడ్డిని టీఆర్ఎస్ బరిలోకి దింపాలని భావిస్తోంది.ఈ స్థానం నుండి శంకరమ్మ కూడ టీకెట్టు ఆశిస్తున్నారు. ఈ తరుణంలో  జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం సైదిరెడ్డి వైపు మొగ్గుచూపుతున్నారని సమాచారం. టీఆర్ఎస్ నిర్వహించిన సర్వేల్లో  కూడ సైదిరెడ్డికి అనుకూలమైన ఫలితాలు వచ్చినట్టు సమాచారం. ఈ స్థానంలో అప్పిరెడ్డి కూడ టికెట్టు కోసం పోటీ పడుతున్నారు. కానీ సైదిరెడ్డి సరైన అభ్యర్ధిగా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కోదాడలో ఉత్తమ్ సతీమణిపై మాజీ టీడీపీ నేత వేనేపల్లి చందర్ రావును బరిలోకి దింపాలని  కేసీఆర్ భావిస్తున్నారు. ప్రజా కూటమి సీట్ల పంపిణీ పూర్తైతే కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుండి అసంతృప్తులు ఎవరైనా టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపితే వారికి కూడ టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేకపోలేదు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ పై  ఉత్తమ్ సతీమణి పద్మావతి విజయం సాధించారు.

అంబర్‌పేట నుండి  స్థానిక కార్పోరేటర్ భర్త కాలేరు వెంకటేశ్వర్లు  బరిలోకి దింపనున్నారు. అనివార్యమైతే వేరే అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం ఉంది. వికారాబాద్ అభ్యర్థి ఎంపిక విషయమై ఇంకా  నిర్ణయం తీసుకోలేదు. మూడు రోజుల క్రితం వికారాబాద్ అభ్యర్థి ఫైనల్ చేసే విషయమై ఆ నియోజకవర్గానికి చెందిన నేతలతో కేటీఆర్ చర్చలు జరిపారు.


సంబంధిత వార్తలు

గ్రేటర్‌లో సగం సీట్లు మనవే: కేసీఆర్, ఆ స్థానాల్లో ఊహించని పేర్లు

ఆ 14 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు కేసీఆర్ కసరత్తు, అదృష్టం ఎవరిదో?

సెంటిమెంట్: అమావాస్య రోజున పోలింగ్, కేసీఆర్‌కు కలిసొచ్చేనా?

తప్పిన కేసీఆర్ లెక్క.....ఎన్నికల్లో కనిపించని లక్కీ నంబర్

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిఈసీ
ఓటుకు నోటులో ఉంది నువ్వు కాదా: చంద్రబాబుకు కేసీఆర్ సవాల్

Follow Us:
Download App:
  • android
  • ios