Asianet News TeluguAsianet News Telugu

గజ్వేల్ నుండి కేసీఆర్ నామినేషన్ దాఖలు

టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ  అపద్ధర్మ సీఎం కేసీఆర్  గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్థిగా బుధవారం మధ్యాహ్నం 2.34 నిమిషాలకు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

kcr files nomination as trs candidate from gajwel segment
Author
Gajwel, First Published Nov 14, 2018, 2:33 PM IST


గజ్వేల్: టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ  అపద్ధర్మ సీఎం కేసీఆర్  గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్థిగా బుధవారం మధ్యాహ్నం 2.34 నిమిషాలకు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

 తన సెంటిమెంట్ ప్రకారంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని  నంగునూరు మండంలోని కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో  కేసీఆర్ తన నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1985 నుండి ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కేసీఆర్.  

వెంకటేశ్వరస్వామి మూల నక్షత్రంలో  కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ముహుర్తం తో రాజయోగమేనని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ముహుర్తం ప్రకారంగానే  కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం  పూట కోనాయిపల్లిలో  నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించిన కేసీఆర్ నేరుగా ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌కు చేరుకొన్నారు.

ఫామ్‌హౌ‌జ్‌లో భోజనం చేసిన తర్వాత  కేసీఆర్ నేరుగా  గజ్వేల్  ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని  అనుకొన్న ముహుర్తం  2.34 గంటలకు  నామినేషన్ పత్రాలను కేసీఆర్  సమర్పించారు.

నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా కార్యకర్తలు ఎవరూ కూడ రావొద్దని ఈ నెల 11వ, తేదీన  కేసీఆర్  కార్యకర్తలకు సూచించారు.  అయితే నామినేషన్ పత్రాు దాఖలు చేసే సమయంలో  బైక్ ర్యాలీ నిర్వహించాలని  టీఆర్ఎస్ స్థానిక నేతలు భావించారు.కానీ, బైక్ ర్యాలీ వద్దని హరీష్‌రావు సూచించారు.దీంతో బైక్ ర్యాలీ లేకుండానే  కేసీఆర్ తన కాన్వాయ్ తో గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకొన్నారు.  

అట్టహసాలకు దూరంగా కేసీఆర్  నామినేషన్ దాఖలు చేశారు.  నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కేసీఆర్ తిరిగి ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌కు చేరుకొంటారు. మిగిలిన 12 స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. నామినేషన్ దాఖలు చేయడానికి 2.34 నిమిషాలు. అయితే పది నిమిషాల ముందే కేసీఆర్ గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొన్నారు.

 

 

సంబంధిత వార్తలు

నేను ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు: కేసీఆర్

అదే సెంటిమెంట్: నామినేషన్ పత్రానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు

తిరుగులేని ముహుర్తంలో కేసీఆర్ నామినేషన్: ఇక రాజయోగమేనా

కేసీఆర్ కోట: గజ్వెల్ సీటు చరిత్ర, సెంటి మెంట్ ఇదీ....

తిరుగులేని ముహూర్తం: నామినేషన్ వేసి...కేసీఆర్ ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారా..?

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత
ఆ 12 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే: ఉత్తమ్‌ను ఢీకొనేది అతనే

గ్రేటర్‌లో సగం సీట్లు మనవే: కేసీఆర్, ఆ స్థానాల్లో ఊహించని పేర్లు

ఆ 14 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు కేసీఆర్ కసరత్తు, అదృష్టం ఎవరిదో?

సెంటిమెంట్: అమావాస్య రోజున పోలింగ్, కేసీఆర్‌కు కలిసొచ్చేనా?

తప్పిన కేసీఆర్ లెక్క.....ఎన్నికల్లో కనిపించని లక్కీ నంబర్

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిఈసీ
ఓటుకు నోటులో ఉంది నువ్వు కాదా: చంద్రబాబుకు కేసీఆర్ సవాల్

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios