Asianet News TeluguAsianet News Telugu

పెద్దపల్లి జిల్లాలో దారుణం... విద్యార్థినులకు పోర్న్ వీడియోలో చూపించిన కీచక టీచర్

ఇద్దరు విద్యార్థుణులపై కన్నేసిన ఓ స్కూల్ టీచర్ పోర్న్ వీడియో లు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. 

teacher sexual harassment on two young stundents in peddappali dsitrict
Author
Peddapalli, First Published Mar 4, 2022, 2:56 PM IST

పెద్దపల్లి: తమ పిల్లలు ఇంట్లో లేదా స్కూల్లో కాస్త సేఫ్ గా వుంటారని తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ ఇటీవల వెలుగుచూస్తున్న సంఘటనలతో స్కూళ్లలో కూడా చిన్నారులకు రక్షణ లేదని అర్థమవుతోంది. విద్యాబుద్దులు నేర్పాల్పిన కొందరు ఉపాధ్యాయులే బుద్దితక్కువ పనులకు పాల్పడుతున్నారు. బిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థిణులపై కన్నేస్తున్న కొందరు కీచక టీచర్లు అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటివి చేస్తున్నారు. ఇలాంటి దారుణమే పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుుకుంది.  

వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా (peddapalli district) ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఓ కీచక టీచర్ పనిచేస్తున్నాడు. ఇతడు అదే స్కూళ్లో 9వ తరగతి చదివే ఇద్దరు బాలికలపై కన్నేసాడు. వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అయితే విద్యార్థిణులు ఉపాధ్యాయుడి వికృత చేష్టలను భరిస్తూ వచ్చారు.  

Video

విద్యార్థిణుల మౌనాన్ని అదునుగా చేసుకుని మరింతగా వేధించడం ప్రారంభించాడు. అతడి చేష్టలు మరీ మితిమీరి చివరకు స్కూల్లోనే విద్యార్థిణులకు పోర్న్ వీడియోలు చూపించే స్థాయికి చేరాయి. ఇద్దరు విద్యార్థిణులను బలవంతంగా ఓ గదిలోకి తీసుకెళ్లి పోర్న్ వీడియోలు చూపించాడు దుర్మార్గుడు. ఎలాగోలా అతడి బారినుండి తప్పించుకున్న బాలికను ఇక ఉపేక్షించకుండా తల్లిదండ్రులకు విషయం తెలిపారు. 

కీచక టీచర్ వికృత చేష్టల గురించి తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి స్కూల్ కి వెళ్లారు. బాలికలకు అశ్లీల వీడియోలు చూపించిన టీచర్ ను పట్టుకుని దేహశుద్ది చేసారు. అంతేకాదు అతడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడు ఇలా నీచానికి పాల్పడటంపై దారుణమని...  అతడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు,గ్రామస్తులు విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేసారు. 

ఇదిలావుంటే వ్యాయామ విద్య‌తో విద్యార్థుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పాల్సిన వ్యాయ‌మ‌ ఉపాధ్యాయుడు.. మాయమాటలతో త‌న పాఠ‌శాల‌లోని విద్యార్థిని శారీర‌కంగా  లొంగదీసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. త‌మ లైంగిక వాంఛ తీర్చితే.. ఏమి కావాలన్నా తాను చూసుకుంటాననే విద్యార్థిని కొన్ని నెల‌లుగా వేధించాడు. ఈ ఘటన  అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం శ్రీధరఘట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది.

బొమ్మనహాళ్‌ మండలం శ్రీధరఘట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప‌నిచేస్తున్న వ్యామ‌య ఉపాధ్యాయుడు అదే పాఠ‌శాలలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థిని ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. తన భార్యకు ఏడాదిగా ఆరోగ్యం సరిగా లేదని, పాఠశాలలోని తన గదిలోకి ఒంటరిగా వచ్చి తన కోరిక తీరిస్తే ఏమి కావాలన్నా తాను చూసుకుంటాననే కీచ‌క ఉపాధ్యాయుడు విద్యార్థిని వేధించాడు. ఈ త‌రుణంలో గ‌త రెండు రోజు కిత్రం ఆ విద్యార్థిని ఇంటిలో ఉన్న సెల్‌ఫోన్‌కు కాల్‌ చేశాడు. 

అయితే ఉపాధ్యాయుడి మాట తీరుపై తల్లిదండ్రులు అనుమానం రావ‌డంతో సెల్ ఫోన్ ను ప‌రిశీలించారు. దీంతో అస‌లు విష‌యం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్‌లో విద్యార్థినికి పంపిన ఆడియో మెసేజీలు చూసి షాక్ అయ్యారు. త‌న కూతురుకు పంపిన ఆడియో చాటింగ్ విన్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  

ప్రధానోపాధ్యాయుడి దృష్టికి కామాంధుడి వైఖరిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమ బాట పడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే వ్యాయామ ఉపాధ్యాయుడు అత్యవసరంగా సెలవు పెట్టి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఈ విష‌యంలో ఉపాధ్యాయుడిపై కేసు రిజిష్ట‌ర్ అయ్యింది.

Follow Us:
Download App:
  • android
  • ios