MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంతకి షాకిచ్చిన అమెజాన్‌ ప్రైమ్‌.. `ది ఫ్యామిలీ మ్యాన్‌ 3`లో స్టార్‌ హీరోయిన్‌కి దక్కని చోటు..? కారణమదేనా?

సమంతకి షాకిచ్చిన అమెజాన్‌ ప్రైమ్‌.. `ది ఫ్యామిలీ మ్యాన్‌ 3`లో స్టార్‌ హీరోయిన్‌కి దక్కని చోటు..? కారణమదేనా?

`ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` సమంతకి విశేష గుర్తింపు పాపులారిటీని తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు మూడో సీజన్‌ విషయంలో మాత్రం పెద్ద షాకిచ్చింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 06 2024, 10:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సమంతకి మాస్‌ ఆడియెన్స్ లో ఫాలోయింగ్‌, పాన్‌ ఇండియా ఇమేజ్‌ని తీసుకొచ్చింది `ది ఫ్యామిలీ మ్యాన్‌2` వెబ్‌ సిరీస్‌. ఇది ఇండియావైడ్‌గా పెద్ద హిట్‌ అయ్యింది. సమంతకి నార్త్ లోనూ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. దీంతో సామ్‌ క్రేజ్‌ బాగా పెరిగింది. అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్‌.. ఈ వెబ్‌ సిరీస్‌ తీసుకొచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దీంతో సమంతకి నార్త్ నుంచి ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్‌ ఆఫర్లు కూడా వచ్చాయని ప్రచారం జరిగింది. కానీ అంతలోనే ఆమె వ్యక్తిగత లైఫ్‌ డిస్టర్బ్ అయ్యింది. భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం, ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆఫర్లు బ్యాక్‌ అయినట్టు సమాచారం. అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్‌ తీసుకోవడం కూడా బాలీవుడ్‌ ఆఫర్లు వెనక్కి వెళ్లినట్టు సమాచారం. 
 

37

అయితే `ది ఫ్యామిలీ మ్యాన్‌` సిరీస్‌ మేకర్స్ రాజ్‌ అండ్‌ డీకే ఇప్పటికే సమంతతో `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌ని రూపొందించారు. ఇది త్వరలోనే విడుదల కానుంది.  అయితే అసలైన సిరీస్‌ మాత్రం మిస్‌ అయినట్టు తెలుస్తుంది. `ది ఫ్యామిలీ మ్యాన్‌` 2 సీజన్‌ కి కొనసాగింపుగా మూడో సీజన్‌ వస్తుందని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన చాలా రోజుల క్రితమే ప్లాన్‌ జరిగింది. 
 

47

ఇన్నాళ్లకి ఎట్టకేలకు `ది ఫ్యామిలీ మ్యాన్‌` మూడో సీజన్‌ ప్రారంభించారు. సోమవారం నుంచి స్టార్ట్ చేసినట్టు అమెజాన్‌ ప్రైమ్‌ ప్రకటించింది. సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతోపాటు కాస్టింగ్ ని కూడా ప్రారంభించారు. రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించే ఈ సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌ పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఆర్టిస్ట్ లు టెక్నీషియన్ల పేర్లనివెల్లడించారు. 
 

57

కానీ మెయిన్‌ లీడ్ గా కనిపిస్తారని భావించిన సమంత పేరు ఈ సిరీస్‌లో లేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. మొదట్నుంచి సమంత మూడో సీజన్‌లో ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఆమె పేరులేదు. దీంతో సమంత ఈ మూడో సీజన్‌లో నటించడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. అమెజాన్‌ ప్రైమ్‌ సామ్‌కి షాక్‌ ఇచ్చారని తెలుస్తుంది. నిజంగానే ఆమె లేదా లేక మున్ముందు యాడ్‌ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 
 

67

అయితే సమంత పేరు లేకపోవడానికి కారణమేంటనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఆరోగ్యం పూర్తి కోలుకోలేక తాను ఈ సిరీస్ చేయడానికి దూరంగా ఉందా? లేక సమంతని వద్దనుకున్నారా? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఈ వెబ్‌ సిరీస్‌ ఒక్క సీజన్‌లో ఒక్కో స్టోరీ బేస్డ్ గా తెరకెక్కిస్తున్నారు. తొలి సీజన్ మొత్తం కశ్మీరీ ఉగ్రవాదం, రాజధాని ఢిల్లీకి వాళ్ల నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో సాగింది. ఇక రెండో సీజన్లో ఎల్టీటీఈ ఉగ్రవాదాన్ని చూపించారు. ఇందులో సమంత ఎల్టీటీఈ ఉగ్రవాదిగా నటించింది.
 

77

ఇప్పుడు మూడో సీజన్‌లో ఏం చెప్పబోతున్నారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. వేరే కథ కావడంతో సమంత పాత్రకి స్కోప్‌ లేక ఆమెని వద్దనుకున్నారా? లేక సమంతనే వదులుకుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే సమంత ఇటీవలే కొత్త సినిమాని ప్రారంభించింది. `మా ఇంటి బంగారం` పేరుతో ఓ లేడీ ఓరియెంట్‌ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే సమంత సినిమాలు చేయడానికి రెడీగానే ఉంది. కానీ అమెజాన్‌ ప్రైమ్‌ వాళ్లు మాత్రం సామ్‌కిహ్యాండిచ్చారా? అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు.  
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Budget Movies: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీస్‌ ఇవే.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Sunny Leone: "మా అమ్మ ఏడ్చేసింది.." అడల్ట్ ఫిల్మ్స్ గురించి ఇంట్లో చెప్పినప్పుడు ఏం జరిగిందో చెప్పిన సన్నీ
Recommended image3
Nithiin: నాని, నితిన్ కాంబినేషన్ టైటిల్ గ్లింప్స్.. ఇది అతడి భార్య కథ, వరుస ఫ్లాపుల తర్వాత రియలైజైన హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved