Telangana Crime  

(Search results - 56)
 • Telangana1, Aug 2019, 3:38 PM IST

  యాదాద్రిలో జింక మాంసంతో పార్టీ:విందులో పలువురు రాజకీయ నేతలు

  యాదాద్రి భువనగిరి జిల్లాలో జింక వేట కలకలం రేపుతోంది. మోత్కురు మండలం కొండాపూర్‌లో జింకను వలపన్ని వేటాడి పలువురు విందు చేసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ పార్టీలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లుగా ఆరోపణలు రావడం సంచలనం కలిగిస్తోంది.

 • women

  Telangana15, Jun 2019, 11:15 AM IST

  యువతిపై పైశాచికం: మద్యం చల్లి, సీసాలతో..

  పోకిరిగాళ్ల కారణంగా హైదరాబద్ లో మరో యువతికి గాయాలయ్యాయి. శంషాబాద్ లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఆమెను వేధించడమే కాకుండా మద్యాన్ని ఆమెపై చల్లారు. అనంతరం మద్యం సీసాలతో కొట్టి గాయపరిచారు. 

 • woman

  Telangana7, Jun 2019, 7:24 PM IST

  అక్రమ సంబంధం... ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్యకు కఠిన శిక్ష

  అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని కట్టుకున్న భర్తను హతమార్చిన ఓ మహిళకు కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ ఘటన 2016 అక్టోబర్ లో చోటుచేసుకోగా అప్పుడే మహిళతో పాటు ఆమె ప్రియున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుండి కోర్టులో ఈ కేసుపై వాదనలు కొనసాగగా తాజాగా తుది తీర్పు వెలువడింది. ఈ హత్యను మృతుడి భార్యే కారణమని తేల్చిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 

 • srinivas reddy

  Telangana19, May 2019, 9:58 AM IST

  నా కొడుకును ఉరి తీయండి: హజీపూర్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి తండ్రి

  నల్గొండ జిల్లా హజీపూర్‌లో తన కామ వాంఛ తీర్చుకోడానికి శ్రీనివాస్ రెడ్డి అనే సీరియల్ కిల్లర్ చిన్నారుల ప్రాణాలను బలితీసున్న విషయం తెలిసిందే. ముగ్గురు చిన్నారులపై ఈ నిందితుడు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడటమే కాదు ఆ తర్వాత క్రూరంగా హతమార్చాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతడి పాపం పండి ఆ  నేరాలన్ని  బయటపడ్డాయి. దీంతో బాధిత కుటుంబాలు, గ్రామస్తులతో పాటు తాజాగా నిందితుడి కుటుంబ సబ్యులు కూడా అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. 

 • తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రివ్యూలు చేసిన విషయాన్ని కూడ బాబు గుర్తు చేశారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడ సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నా... ఏపీలో మాత్రం సీఎస్ మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాబు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌ను తాను అడుక్కోవాలా... అని కూడ బాబు ఒకానొక దశలో వ్యాఖ్యలు చేశారు.

  Telangana18, May 2019, 5:44 PM IST

  రెండెకరాల భూమి కోసం ఏకంగా కేసీఆర్ సంతకమే ఫోర్జరీ...టీఆర్ఎస్ నేత హస్తం

  తెలంగాణలో భూఆక్రమణలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలియజేసే సంఘటన రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఐటీ పరిశ్రమలు, ధనవంతుల నివాసాలకు నిలయమైన గచ్చిబౌలి ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని  కొట్టేయడానికి కొందర భూబకాసురులు స్కెచ్ వేశారు. ఇందుకోసం  ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 

 • kukatpally

  Telangana27, Apr 2019, 7:50 PM IST

  కూకట్ పల్లిలో విద్యార్థుల వీరంగం...నడిరోడ్డుపై రాళ్ళు,కర్రలతో పరస్పర దాడులు (వీడియో)

  హైదరాబాద్ కూకట్ పల్లిలో కొందరు విద్యార్థులు వీరంగం సృష్టించారు. పట్టపగలు నడి రోడ్డుపై సినిమా స్టైల్లో ఫైటింగ్ కు దిగారు. రెండే గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు దిగారు. దీంతో సంఘటనా స్థలంలో కొద్దిసేపు భయానక వాతావరణం ఏర్పడింది. 

 • kamareddy accident

  Telangana22, Apr 2019, 5:38 PM IST

  కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి దుర్మరణం

  కామారెడ్డి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిక్కనూరు మండలం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై ఓ బైక్ ఎదురుగా వేగంగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా కారులో వున్న వారు తీవ్ర గాయాలపాలయ్యారు. 
   

 • Telangana18, Apr 2019, 3:47 PM IST

  పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య... ఇద్దరూ మైనర్లే

  వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా మైనర్లుగా వున్నపుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇలా ప్రేమ బంధంతో దగ్గరైన ఈ జంట పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని అనుకున్నారు. అయితే అందుకు ఇరు కుటుంబాలు అంగీకరించలేవు. దీంతో కలిసి బ్రతకలేకపోయినా కలిసి చావాలని నిర్ణయించుకుని   పురుగుల మందు తాగి ప్రాణత్యాగానికి పాల్పడ్డారు. 

 • jagityal murder

  Telangana16, Apr 2019, 1:28 PM IST

  పట్టపగలే నడిరోడ్డుపై గొడ్డలితో దాడి... రెండు గుంటల భూమి కోసం దారుణం

  కేవలం రెండు గుంటల భూమి కోసం ఓ దుండగుడు  దారుణానికి పాల్పడ్డాడు. భూవివాదం కారణంగా ఓ వ్యక్తిపై కోపాన్ని పెంచుకుని అతడిని పట్టపగలే నడిరోడ్డుపై గొడ్డలితో నరికి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

 • Railway budget

  Telangana5, Apr 2019, 8:17 PM IST

  కేటీఆర్ రోడ్ షో‌కు వెళుతుండగా తల్లీకూతుళ్ల దుర్మరణం....

  లోక్ సభ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం మల్కాజిగిరిలో కేటీఆర్ చేపట్టనున్న రోడ్ షో లో హాజరయ్యేందుకు వెళుతూ తల్లీ కూతుళ్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద  సంఘటన లాలాపేట లో చోటుచేసుకుంది. 

 • fire

  Telangana5, Apr 2019, 2:31 PM IST

  మేనల్లుడితో కలిసి కన్న కొడుకును హతమార్చిన తల్లి... ప్రియురాలిని కూడా

  గత నెలలో భద్రాద్రి జిల్లాలో జరిగిన ప్రేమ జంట సజీవదహనం కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. మృతుల కుటుంబసభ్యులు తమవారిది ఆత్మహత్యేనని చెబుతున్నా పోలీసులు మాత్రం వీరిది హత్యేనన్న అనుమానంతో విచారణ కొనసాగించారు. చివరకు పోలీసుల అనుమానమే నిజమయ్యింది. మృతుడి కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారని గుర్తించి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం కొత్తగూడెం డీఎస్పీ అలీ మీడియాకు వివరించారు. 

 • lovers suicide

  Telangana31, Mar 2019, 3:22 PM IST

  శంషాబాద్ లో విషాదం...రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య

  వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. గతకొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ప్రేమజంట పెళ్లి చేసుకొని ఒక్కటై ఆనందంగా జీవించాలనుకుని ఎన్నో కలలు కన్నారు. కానీ ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కలిసి బ్రతకాలనుకున్న వీళ్లు చివరకు కలిసి చావాలనుకున్నట్లున్నారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు కలిసి రైలుకిందపడి తనువు చాలించారు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. 

 • rape

  Telangana28, Mar 2019, 3:08 PM IST

  పరీక్ష హాల్లో విద్యార్థినిపై కన్నేసి... అత్యాచారయత్నానికి పాల్పడిన ఇన్విజిలేటర్

  అతడో ప్రభుత్వోద్యోగి. యాబై ఏళ్ళకు పైబడి వయసుంటుంది.  మరికొన్నేళ్లలో రిటైరై మనవలు, మనవరాళ్లతో ఆడుకుంటూ శేషజీవితాన్ని గడపాల్సిన వయసులో కామంతో కళ్లుమూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. మనవరాలి వయసున్న విద్యార్థినిపై కన్నేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే బాలిక అతడి నుండి తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 • murder

  Telangana9, Mar 2019, 8:56 PM IST

  వివాహేతర సంబంధం...సుఫారీ ఇచ్చిమరీ భర్తను చంపించిన భార్య

  తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ తన భర్తను కిరాయి హంతకుడికి సుఫారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. ఈ ఘటన సనత్ నగర్ లో చోటుచేసుకుంది.

 • Telangana5, Feb 2019, 3:01 PM IST

  గోల్కొండ కోటలో దోపిడీ దొంగల వీరంగం...

  హైదరాబాద్‌ వైభవాన్ని చాటిచెప్పే పురాతన కట్టడం గోల్కొండ కోటలో ఆదివారం దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. ఈ కోట పరిధిలోని ఓ హిందూ దేవాలయంలో(అమ్మవారి గుడి) హుండీలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు. అయితే మరుసటి రోజు ఆలయ పూజారి ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చోరి ప్రయత్నం గురించి బయటపడింది.