తెలంగాణ ఎన్నికల వేడి అమరావతిని తాకింది.. తనకు ఎల్‌నగర్ టికెట్ బదులు ఇబ్రహీంపట్నం కేటాయించడంపై గుర్రుగా ఉన్న సామ రంగారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు అమరావతి చేరుకున్నారు. 

తెలంగాణ ఎన్నికల వేడి అమరావతిని తాకింది.. తనకు ఎల్‌నగర్ టికెట్ బదులు ఇబ్రహీంపట్నం కేటాయించడంపై గుర్రుగా ఉన్న సామ రంగారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు అమరావతి చేరుకుని ఉదయం సీఎంతో సమావేశమయ్యారు.

11 ఏళ్ల పాటు ఎల్బీనగర్‌లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేశానని.. అలాంటి తనకు ఎల్‌బినగర్ బదలు ఇబ్రహీంపట్నం కేటాయించడంపై సామ అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఎల్బీనగర్‌లోని ఏ వార్డులోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం రాదని.. ఈ స్థానం టీడీపీకి కేటాయిస్తే 25 వేల మెజారిటీ ఖాయమన్నారు..

దమ్మూ, ధైర్యం లేని నేతల వద్ద తాను పనిచేయాల్సి వస్తోందని రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. మల్‌రెడ్డి రంగారెడ్డి తనకు వద్దకు వచ్చి.. ఇబ్రహీంపట్నం ఎందుకిచ్చారని ప్రశ్నించారని.. తనకు అక్కడ పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పానని ఆయన సీఎంతో అన్నట్లుగా సమాచారం.

ఒకవేళ ఇబ్రహీంపట్నంలో పోటీ చేసినా రంగారెడ్డి సహకరించకుంటే తన పరిస్థితేంటని ఆయన అధినేతను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అందరితో చర్చిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది.

టీ టీడీపీ రెండో జాబితా విడుదల

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను తాకిన అసంతృప్తి జ్వాల, కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే

బరిలో రేవూరి: కీలక నిర్ణయం దిశగా నాయిని, ఆ పార్టీకి షాకేనా...