Asianet News TeluguAsianet News Telugu

టీ టీడీపీ రెండో జాబితా విడుదల

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జోరుపెంచింది. మహాకూటమి పొత్తులో భాగంగా 14 సీట్లు టీడీపీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన టీ టీడీపీ తాజాగా రెండో జాబితా విడుదల చేసింది. 

T-tdp released second list.
Author
Hyderabad, First Published Nov 14, 2018, 9:24 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జోరుపెంచింది. మహాకూటమి పొత్తులో భాగంగా 14 సీట్లు టీడీపీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన టీ టీడీపీ తాజాగా రెండో జాబితా విడుదల చేసింది. 

మధ్యాహ్నాం అమరావతిలో ఉన్న టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఫోన్ చేశారు. ఐదుగురు అభ్యర్థులపై ఫోన్లో చర్చించారు. దాంతో ఇద్దరు అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ రెండో జాబితా విడుదల చేసింది. 

ఇబ్రహీం పట్నం అభ్యర్థిగా సామ రంగారెడ్డి, రాజేందర్ నగర్ నియోజకవర్గం అభ్యర్థిగా గణేష్ గుప్తా పేర్లను ప్రకటించింది. ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ తాజాగా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మెుత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో ముగ్గురు అభ్యర్థులతో కూడిన మూడో జాబితా గురువారం విడుదల చెయ్యనుంది.   

ఇకపోతే రాజేందర్ నగర్ నియోజకవర్గాన్ని మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కేటాయించింది. అయితే బుధవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తీక్ రెడ్డి నామినేషన్ వేశారు. పొత్తు ధర్మాన్ని విస్మరించారని టీడీపీ ఇఫ్పటికే రుసరుసలాడుతోంది. అయినా అభ్యర్థిని ప్రకటించింది. 

ఈ వార్తలు కూడా చదవండి

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే

కాంగ్రెస్, టీడీపీ జాబితాలపై సెగ: పోటీకి రెబెల్స్ రెడీ

నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదు: కోదండరామ్
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి

పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

Follow Us:
Download App:
  • android
  • ios