తాను కోరుకొన్న ఎల్బీనగర్ టికెట్టు దక్కకపోవడంతో టికెట్టు మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లిన టీడీపీ నేత సామ రంగారెడ్డికి నిరాశే ఎదురైంది.
హైదరాబాద్: తాను కోరుకొన్న ఎల్బీనగర్ టికెట్టు దక్కకపోవడంతో టికెట్టు మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లిన టీడీపీ నేత సామ రంగారెడ్డికి నిరాశే ఎదురైంది. మహా కూటమి( ప్రజకూటమి) పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం టీడీపీ టికెట్టు సామ రంగారెడ్డికి దక్కడంతో ఆ స్థానంలో గెలుపు బాధ్యతను నామా నాగేశ్వర్‌రావుకు చంద్రబాబునాయుడు అప్పగించారు.
ఎల్బీనగర్ టీడీపీ టికెట్టును సామ రంగారెడ్డి కోరుకొన్నారు. అయితే ఎల్బీనగర్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు దీంతో రంగారెడ్డి ఇబ్రహీంపట్నం స్థానాన్ని టీడీపీకి కేటాయించింది.
ఇబ్రహీంపట్నం నుండి సామ రంగారెడ్డికి టీడీపీ టికెట్టు కేటాయించింది. రంగారెడ్డి ఎల్బీనగర్ టికెట్టు కోరుకొంటే ఇబ్రహీంపట్నం టికెట్టు ఇవ్వడంతో సామ రంగారెడ్డి ఖంగుతిన్నారు. దీంతో ఆయన హుటాహుటిన గురువారం ఉదయం అమరావతిలో చంద్రబాబునాయుడును కలుసుకొన్నారు.
తనకు ఎల్బీనగర్ టికెట్టు కావాలని కోరారు. ప్రజా కూటమి అవసరాల రీత్యా ఎల్బీనగర్ టికెట్టు ఇవ్వలేకపోయినట్టు చంద్రబాబునాయుడు రంగారెడ్డికి చెప్పారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టించి పనిచేస్తున్నందునే ఇబ్రహీంపట్నం టికెట్టును కేటాయించినట్టు బాబు రంగారెడ్డికి వివరించారు.
ఇబ్రహీంపట్నంలో సామ రంగారెడ్డిని గెలిపించే బాధ్యతను పార్టీ తీసుకొంటుందని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎల్బీనగర్‌లో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను నామా నాగేశ్వరరావుకు చంద్రబాబునాయుడు అప్పగించారు.
బాబుతో సమావేశం కావడానికి ముందు సామ రంగారెడ్డి అనుచరులు అమరావతిలో బాబు నివాసం ముందు టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాబుతో సమావేశమైన తర్వాత సామ రంగారెడ్డిని తీసుకొని నామా నాగేశ్వరరావు హైద్రాబాద్‌కు బయలుదేరారు.
ఇదిలా ఉంటే ఇబ్రహీంపట్నం నుండి టీడీపీ టికెట్టు ఆశించినా స్థానికేతరుడైన సామ రంగారెడ్డి పార్టీ టికెట్టు కేటాయించడంతో టీడీపీ నేత భీంరెడ్డి రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఎల్బీనగర్ లో తన అనుచరులో భీంరెడ్డి సమావేశమయ్యారు.
సంబంధిత వార్తలు
అమరావతిలో ఎల్‌బి నగర్ పంచాయతీ.. బాబుతో సామ భేటీ
తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ
హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్
కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను తాకిన అసంతృప్తి జ్వాల, కార్యకర్త ఆత్మహత్యాయత్నం
ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే
బరిలో రేవూరి: కీలక నిర్ణయం దిశగా నాయిని, ఆ పార్టీకి షాకేనా...
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 15, 2018, 12:03 PM IST