Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో అంతర్జాతీయ వ్యభిచార ముఠా.. నాలుగు వాట్సప్ గ్రూపులు, ఒక్కోదాంట్లో 400మంది సభ్యులతో దందా..

హైదరాబాద్ లో వెలుగుచూసి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరు వాట్సాప్ గ్రూపులు, డ్రగ్స్ లతో దందా నడిపేవారు. 

shocking truths in international prostitution racket in Hyderabad, Four WhatsApp groups, each with 400 members
Author
First Published Dec 8, 2022, 7:03 AM IST

హైదరాబాద్ : హైదరాబాదులో మంగళవారం వెలుగుచూసిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛేదించడంలో సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ స్పీడ్ పెంచింది. దీంట్లో భాగంగా అరెస్ట్ అయిన 18 మంది నిందితుల కాల్ డేటా, నగదు లావాదేవీలను ఈ కేసు దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వ్యభిచార గృహాల నిర్వాహకులు కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా నగరాన్ని విడిచి వెళ్లారు.  ఇది గుర్తించిన దర్యాప్తు  అధికారులు ప్రత్యేక బృందాలతో వేటాడుతున్నారు. 

ఢిల్లీ, కోల్కతా, ముంబైలలో ఉంటూ కొందరు ఆన్లైన్ ద్వారా హైదరాబాదులో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని  దర్యాప్తులో తేలింది. ఇలాంటి వారి పైన నిఘాపెట్టారు అధికారులు. దీనికోసం వేరువేరు నగరాల పోలీస్ కమిషనర్ లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఈ ముఠా చేతుల్లో ఇరుక్కున్న యువతుల ఫోన్లల్లో ఉన్న వివరాలను సేకరించి వాటి ఆధారంగా కూపీ లాగుతున్నారు. ఇక ఈ అంతర్జాతీయ సెక్స్ రాకెట్ విషయంలో కీలకంగా వ్యవహరించిన ఐదుగురిని..  రెండు మూడు రోజుల్లో అరెస్టు చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ ముఠా గుట్టు రట్టు:17 మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

ఎక్కువ ఐటీ ఉద్యోగులే…
ఈ అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసులో విటులు కూడా ముఖ్య పాత్ర ఉందని  అంచనా వేస్తున్నారు. దీంతో వీరిపైనా దృష్టి పెట్టారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో పాటు అనేక మార్గాల్లో జరిగిన చెల్లింపుల తాలూకు లావాదేవీలను విశ్లేషించారు. దీంతో వీరి దగ్గరికి వచ్చిన వారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు అని తేలింది. దాదాపుగా 60 శాతం మంది ఐటీకి చెందిన వారేనని సమాచారం. దీనిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.

వాట్సాప్ గ్రూప్ ల తో దందా..
నిర్వాహకుల ఫోన్లను పరిశీలించినప్పుడు పోలీసులు ఆశ్చర్యపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏడుగురు ప్రధాన నిందితుల ఫోన్లలోని సమాచారం ప్రకారం.. ఈ దందా అంతా వాట్సాప్ గ్రూప్ లతో లింక్ అయింది. ఒక్కో ఫోన్లో నాలుగు వాట్సాప్ గ్రూపులు ఉన్నట్లు, ఈ గ్రూపులో నిర్వాహకులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇక ఒక్కో గ్రూపులో 400 మంది మధ్యవర్తులు ఉన్నారు. వీరంతా విదేశాలకు చెందిన వారే. ఇక తమ దగ్గరికి ఒకసారి వచ్చిన విటులను మళ్లీ మళ్లీ ఆకర్షించేందుకు  ఎన్నో సదుపాయాలు కల్పించారు. ఒకసారి తమ దగ్గరకు వచ్చిన వారికి  యువతుల ద్వారా గంజాయి, డ్రగ్స్ ఇప్పించేవారు. 

దీని కోసం ముంబైలోని ఓ వ్యక్తి ద్వారా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తెప్పించేవారు. ముంబైకి చెందిన గుడ్డూ అలియాస్ సోఫిన్ పటేల్ అలియాస్ అబ్బాస్ అనే వ్యక్తి ద్వారా  వీరికి మాదకద్రవ్యాలు అందేవని  దర్యాప్తులో తేలింది’  అని పోలీసులు తెలిపారు. కొన్ని హోటళ్లలో మేనేజర్ స్థాయి లో పనిచేస్తున్న వ్యక్తులతో  నిందితులు కుమ్మక్కయినట్టు  తేలింది. దీంతో హోటల్ మేనేజర్లు ఇతర సిబ్బందికి కమిషన్ ముట్టజెప్పి ఈ ముఠాకు సహకరించేవారు. ఈ క్రమంలో హోటల్ కు  ఎక్కువమంది వస్తుండడంతో దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారని పోలీసులు అంటున్నారు. 

మొదటి విడతగా పోలీసులు అరెస్టు చేసిన 18 మందిలో ఇద్దరు  హోటల్ మేనేజర్లు కూడా ఉన్నారు. ఇదే దీనికి నిదర్శనమని అన్నారు. ఒక్కో యువతి పదిరోజులపాటు హోటల్ లోనే ఉండేవారని.. వాళ్ల దగ్గరికి అనేకమంది వ్యక్తులు వచ్చిపోతూ ఉన్నా.. ఇదేమిటని సిబ్బంది ప్రశ్నించేవారు కాదు. అంతేకాక వారికి సేకరించేవారు.  దీనికి కారణం వారి మధ్య ఉన్న  ఒప్పందమే’  అని అని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios