Asianet News TeluguAsianet News Telugu

'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి యూటర్న్ ... ఆనాడు ఒప్పయింది ఇప్పుడు తప్పెలా..?'

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జగన్ సర్కార్ రైతుల కోసం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వివాదం రాజుకుంది. అయితే చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసమే ఈ చట్టంపై దుష్స్రచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

TDP Janasena BJP spreading falsehood against Land Titling Act : YSRCP Leaders AKP
Author
First Published May 6, 2024, 1:50 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మరో ఏడెనిమిది రోజుల్లో పోలింగ్ జరగనుంది. దీంతో అధికార వైసిపి, ప్రతిపక్ష కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ని తెరపైకి తీసుకువచ్చింది. అయితే వైసిపి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రతిపక్షాలు ఈ చట్టంపై రాద్దాంతం చేస్తున్నాయని... భూరక్షణతో పాటు వివాదాలను ఈజీగా పరిష్కరించుకోడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలకు మరీముఖ్యంగా రైతులకు మేలు చేసేందుకు ఈ యాక్ట్ ను తీసుకువచ్చామని వైసిపి చెబుతోంది. కానీ టిడిపి, జనసేన, బిజెపి కూటమి మాత్రం స్వార్థ రాజకీయాల కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నాయని.. ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకోడానికి ప్రయత్నిస్తున్నారని వైసిపి నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నవారు గతంలో పొగిడారని వైసిపి గుర్తుచేస్తోంది. 

గతంలో ఇదే  టిడిపి పార్టీకి చెందిన నాయకులు ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి గొప్పగా మాట్లాడటాన్ని వైసిపి గుర్తుచేస్తోంది. జగన్ ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వస్తుందోనని ప్రతిపక్ష కూటమి భయపడుతోందని అన్నారు. ఇప్పటికే ప్రజలంతా వైఎస్ జగన్ వైపు నిలిచారు... ఎలాగైనా ఆయననుండి ప్రజలను దూరం చేయాలనే కూటమి కుట్రలు పన్నుతోందని అంటున్నారు. ఇందుకోసం ఎల్లో మీడియాను రంగంలోకి దింపి కొద్దిరోజుల క్రితమే ఈ చట్టాన్ని రైతుల చట్టంగా పేర్కొన్నవారే ఇప్పుడు ఏదో భూతంలా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారట. భూములు, స్థలాలను కాపాడేందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చినట్లు తెలిసినా తమకు తెలిసిన దుష్ప్రచార అస్రాన్ని వాడుతున్నారని వైసిపి నాయకులు అంటున్నారు. 

వైసిపి సర్కార్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూయజమానుల కోసమే... దీని ద్వారా తమ ఆస్తులను కాపాడుకునేందుకు ఎవరూ యాతనపడాల్సిన అవసరం లేదని అందరికీ తెలుసు.  ఇదే అభిప్రాయాన్ని గతంలో టిడిపి నాయకులు కూడా వ్యక్తం చేసారు. ఇప్పుడు కేవలం ఒక్క చంద్రబాబు నాయుడికో, ఆయన కూటమి ఈ చట్టం వల్ల ఓట్లు రాలవని తెలిసి రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. వీళ్ల పరిస్థితి ఎలా తయారయ్యిందంటే చంద్రబాబుకు పనికి వస్తేనే రాజ్యాంగం వుండాలి... లేదంటే దాన్నికూడా రద్దు చేయడం అనేలా వుందంటూ వైసిపి నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. లాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి నాయకుల రాద్దాంతం చూస్తుంటే పవిత్ర మతగ్రంధాలు రామాయణం, ఖురాన్, బైబిల్ లు కూడా తమకు ఉపయోగపడవని అనుకుంటే చదవొద్దని చెప్పడానికి ఏమాత్రం వెనకాడరని వైసిపి నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. 

గతంలో ల్యాండ్ టైట్లిలింగ్ చట్టం సూపర్...ఇలాంటి చట్టం దేశంలోనే లేదంటూ అసెంబ్లీ సాక్షిగా టిడిపి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల మాటలను వైసిపి గుర్తుచేస్తోంది. ఇలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింతగా వుంటారని... భూములకు భద్రత వుంటుందని ఆనాడు అసెంబ్లీలో మాట్లాడారు పయ్యావుల. పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు...ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని పయ్యావుల డిమాండ్ చేసారు. పయ్యావుల మాటలువిని ఆహా ఓహో అంటూ బల్లలు చరిచిన వారే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తప్పుబడుతున్నారని వైసిపి నాయకులు అంటున్నారు. 

ఇక టిడిపి అనుబంధ మీడియా ఈటివిలో కూడాఈ చట్టం గొప్పది అంటూ కథనాలు ఇచ్చారని వైసిపి గుర్తుచేస్తోంది. కానీ ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీరావు ముందున్నారని అంటున్నారు. ఈనాడు పేజీలన్నీ ఆ చట్టాన్ని భూతంలా చూపిస్తూ నింపేయడం...ఈటీవీలో గంటలకొద్దీ చర్చలు పెట్టడం చేస్తున్నారని అంటున్నారు. ఆంటే చంద్రబాబు కోసం తన వైఖరిని ఎలాగైనా మార్చుకునేందుకు రామోజీరావుకు ఎలాంటి సిగ్గు ఉండదా అంటే వైసిపి నాయకులు మండిపడుతున్నారు. 

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ గతంలో ప్రసంగించారు... ఇప్పుడు ఆమెకూడా తన సోదరి భర్తతో చేతులుకలిపిందని అంటున్నారు. ఈ చట్టం గొప్పతనం, దీనివల్ల ప్రజలకు కలిగే మేలు గురించి అందరికీ తెలుసు... కానీ చంద్రబాబు కోసం మాట మారుస్తున్నారన్నారు. జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేసేవారితో పాటు చంద్రబాబుకు సైతం  జేజెమ్మ గుర్తొస్తుందని వైసిపి నాయకలు హెచ్చరిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios