న్యూఢిల్లీ: టీఆర్ఎస్‌ నుండి వలసలు విశ్వేశ్వర్ రెడ్డితో  ప్రారంభమయ్యాయని.... త్వరలోనే  మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ కుంతియా చెప్పారు.

న్యూఢిల్లీలో చేవేళ్ల ఎంపీ  కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీతో బుధవారం నాడు  సమావేశమైన తర్వాత ఆయన  విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి  మీడియాతో మాట్లాడారు.

తమ పార్టీలో టీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్‌ ఎంపీలు చేరబోతున్నారని కుంతియా బాంబు పేల్చారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు కూడ  కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కుంతియా తెలిపారు. అయితే ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే  విషయాన్ని తాను ఇప్పుడే మీడియాకు చెప్పబోనని చెప్పారు.

ఇది ఆరంభం మాత్రమే..... త్వరలోనే టీఆర్ఎస్‌కు సినిమాను చూపిస్తామని కుంతియా స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు కూడ  చేరుతారని కుంతియా చెప్పడంతో  పార్టీని వీడే  నేతలు ఎవరనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది.


సంబంధిత వార్తలు

రెండేళ్లుగా నా బాధను ఎవరూ పట్టించుకోలేదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడినా నష్టం లేదు: మహేందర్ రెడ్డి

ఢిల్లీలో కొండా రాజకీయాలు.. ఇవాళ రాహుల్‌‌ గాంధీతో భేటీ

విశ్వేశ్వర రెడ్డి రాజీనామా: ఆయన చెప్పిన ఐదు కారణాలు ఇవీ...

ఇమడలేకపోతున్నా: విశ్వేశ్వర్ రెడ్డి, 23న కాంగ్రెస్‌లోకి...

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

2నెలల ముందే విశ్వేశ్వరరెడ్డి రాజీనామాకు స్కెచ్

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా (వీడియో)

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్