హైదరాబాద్:  అధికార పార్టీలో ఉండి కూడ తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోయినట్టు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. ఎంపీ పదవికి  వ్యక్తిగతంగా స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.రెండేళ్లుగా తన సమస్యలను ఎవరూ కూడ పట్టించుకోలేదన్నారు.

చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బుధవారం నాడు  న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం  కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాతో కలిసి  విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  నాలుగు ఏళ్లుగా తన ఇబ్బందులు తనకు ఉన్నాయన్నారు. కానీ రెండేళ్లుగా మాత్రం  ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయన్నారు. వీటిని  పరిష్కరించాలని కోరినా కూడ  పట్టించుకోలేదన్నారు.

టీఆర్ఎస్ సరైన నిర్ణయాలు తీసుకొన్నందునే తాను  టీఆర్ఎస్ ను వీడాల్సి వచ్చిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ నెల 23వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతానని రాహుల్‌కు చెప్పినట్టు  చెప్పారు. నిన్ననే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్టు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను  టీఆర్ఎస్ అమలు చేయలేదన్నారు. తన నియోజకవర్గంతో పాటు,  రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరించినట్టు చెప్పారు.

తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలను  రాహుల్‌కు గుర్తు చేసినట్టు చెప్పారు. వ్యక్తిగత విబేధాలు టీఆర్ఎస్ లో చేరినట్టు  చెప్పారు.  రెండేళ్ల నుండి తాను పార్టీలో పోరాడుతున్నట్టుగా  విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కానీ ప్రాంతీయ పార్టీలో  ప్రజాస్వామ్యం తక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రేపు  మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలను వివరిస్తానని ఆయన తెలిపారు.


సంబంధిత వార్తలు

విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడినా నష్టం లేదు: మహేందర్ రెడ్డి

ఢిల్లీలో కొండా రాజకీయాలు.. ఇవాళ రాహుల్‌‌ గాంధీతో భేటీ

విశ్వేశ్వర రెడ్డి రాజీనామా: ఆయన చెప్పిన ఐదు కారణాలు ఇవీ...

ఇమడలేకపోతున్నా: విశ్వేశ్వర్ రెడ్డి, 23న కాంగ్రెస్‌లోకి...

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

2నెలల ముందే విశ్వేశ్వరరెడ్డి రాజీనామాకు స్కెచ్

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా (వీడియో)

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్