హైదరాబాద్: చేవేళ్లే ఎంపీ విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్ కు మంగళవారం నాడు రాజీనామా చేశారు.

పార్టీలో కొంత కాలంగా నెలకొన్న పరిణామాలపై  విశ్వేశ్వరరెడ్డి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది.  టీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని  విశ్వేశ్వర రెడ్డి  నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమయంలోనే  పార్టీకి రాజీనామా  చేశారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన  అపద్ధర్మ  మంత్రి  పట్నం మహేందర్ రెడ్డి మధ్య ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మధ్య కొంత కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వీరిద్దరికి కూడ  పార్టీలో పొసగడం లేదు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే  విశ్వేశ్వర్ రెడ్డి  టీఆర్ఎస్‌ కు రాజీనామా చేస్తారని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో  మంత్రి కేటీఆర్ తో  ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు.

ఈ సమావేశం తర్వాత  తాను టీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నట్టు ఆయన చెప్పారు.  పార్టీలో తనకు నెలకొన్న  సమస్యలను విశ్వేశ్వర్ రెడ్డి  పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాడు. ఈ పరిణామాల నేపథ్యంలో  టీఆర్ఎస్ నాయకత్వం పట్టించుకోలేదని  విశ్వేశ్వర్ రెడ్డి   అభిప్రాయంతో ఉన్నారు. 

రెండేళ్ల క్రితమే విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం సాగింది. కానీ,  విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం పార్టీలోనే కొనసాగారు.  కానీ,  పార్టీ నాయకత్వం  తాను లేవనెత్తిన  సమస్యలను పట్టించుకోలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేశారు.

మంగళవారం సాయంత్రం  కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మూడు పేజీల లేఖను  విశ్వేశ్వర్ రెడ్డి రాశారు.  పార్టీలో తనను బలహీనపర్చేందుకు  ప్రయత్నిస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి ఆ లేఖలో ఆరోపించారు. టీఆర్ఎస్‌తో పాటు  ఎంపీ  పదవికి కూడ రాజీనామా చేస్తున్నట్టు విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

పార్టీని వీడడానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డగి ఐదు కారణాలను ప్రధానంగా ఆ లేఖలో వివరించారు.తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.అంతేకాదు వారికే పార్టీలో ప్రాధాన్యతను కల్పించారన్నారు.

పార్టీలో సమస్యలను పరిష్కరించేందుకు తాను చేసిన ప్రయత్నాలన్నీ కూడ విఫలమయ్యాయని విశ్వేశ్వర రెడ్డి చెప్పారు.పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగడం తనకు బాధ కల్గించిందని  ఆయన అభిప్రాయపడ్డారు. 

2014 ఎన్నికలకు ముందు  కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో   ఇదే స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి, మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు తూళ్ల వీరేందర్ గౌడ్ పోటీ చేశారు. కార్తీక్ రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న సమయంలో విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం తెలంగాణ ఎన్నికల రాజకీయాల్లో వేడి పుట్టింది.

                                            

                                        

 

వీడియో 

                                    

వీడియో

"

సంబంధిత వార్తలు

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్