కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

ఇటీవల రేవంత్ రెడ్డి.. ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా..ఆ వార్త తెలంగాణ నాట సంచలనంగా మారింది. ఆ ఇద్దరూ ఎంపీలు  సీతారాం నాయక్, విశ్వేశ్వర రెడ్డి లు అంటూ ప్రచారం ఊపందుకుంది.

కాగా.. ఆ ఆరోపణలను సీతారాం నాయక్ ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారుతున్న ఆ ఇద్దరు ఎంపీలేవరో చెప్పాలని సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దుర్మార్గపు పనులు చేస్తున్నారని.. అవి ఆయన ఎదుగుదలకు పని చేయవు అని చెప్పారు. 

రేవంత్ ప్రవర్తన అందరికీ తెలుసన్నారు టీఆర్‌ఎస్ ఎంపీ. సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే తాను మహబూబాబాద్ ఎంపీగా గెలిచానని సీతారాం నాయక్ స్పష్టం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు.

ఇదిలా ఉండగా.. తాను టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చేవెళ్ల లోకసభ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిశారు. తాను పార్టీ వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన కేసిఆర్ కు చెప్పినట్లు సమాచారం.

read more news

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్