పొద్దున లేస్తే.. తెలంగాణ సిఎం కేసిఆర్ మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఏ అవకాశం దొరికినా ఆయన కేసిఆర్ కుటుంబంపై విమర్శలు ఎక్కు పెడుతుంటారు. మొన్న విద్యుత్ విషయంలో చర్చకు సై  అని తర్వాత వెనకడుగు వేసింది టిఆర్ఎస్ పార్టీ. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి చర్చలకు రమ్మంటూ గన్ పార్కు వద్దకు చేరుకుని హడావిడి చేశారు.

అయినా.. అధికార పార్టీ రేవంత్ తో చర్చల ముచ్చటే లేదని తేల్చి చెప్పింది. దొంగతో చర్చలేందని లైట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ ఎపిసోడ్ లో అధికార పార్టీ కంటే రేవంతే పైచేయి సాధించారు. అయితే రేవంత్ గన్ పార్కు దగ్గరినుంచి వెళ్లిన తర్వాత టిఆర్ఎస్వి నేతలు గన్ పార్కులోని అమరుల స్థూపం వద్ద శుద్ధి చేపట్టారు. అమరుల స్థూపం అపవిత్రం అయిందని పాలతో కడిగారు. అయితే గన్ పార్కు వద్ద రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కేసిఆర్ పాపాల చిట్టా.. ఇది ఒక్కటే లేదు.. నాలుగు కాపీలు దగ్గర పెట్టుకున్న.. అంటూ రేవంత్ పంచ్ డైలాగులు వదిలారు. మీరూ చూడండి ఆ వీడియో.