జగిత్యాల: ఈ రూట్ సురక్షితం కాదని నెల రోజులే క్రితమే అధికారులకు చెప్పినా వినలేదని ప్రమాదానికి కారణమైన బస్సు కండక్టర్  పరమేశ్వర్ చెబుతున్నారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ బస్సును  సాధారణంగా వెళ్లే రూట్‌లో కాకుండా కొత్త రూట్‌ మీదుగా బస్సును మళ్లించారు.  అయితే ఈ రూట్ మీదుగా  బస్సును మళ్లించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తాము అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని కండక్టర్ పరమేశ్వర్ చెప్పారు.  కానీ, కలెక్షన్ల కోసం  కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా బస్సును  రూట్ మార్చారని ఆయన చెప్పారు. 

మంగళవారం నాడు  కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద  జరిగిన ప్రమాదంలో 60 మంది మృతి చెందారు.  మరో 20 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 36 మంది మహిళలు , ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో  శనివారపేట, దుబ్బతిమ్మాయిపల్లి, కిస్మత్ పేట గ్రామస్తులు ఉన్నారని  అధికారులు ప్రకటించారు. 

ఈ వార్తలు చదవండి

కొండగట్టు ప్రమాదం: 70 కి.మీ స్పీడ్‌తో బస్సు

కొండగట్టు విషాదం: ఐస్‌బాక్స్‌లో శవాన్ని పెట్టేందుకు డబ్బులు లేక.. ఐస్‌గడ్డలపై వరిపొట్టు పోసి
కొండగట్టు ప్రమాదం...బస్సు నడిపింది ఈ ఉత్తమ డ్రైవరే...

కొండగట్టు ప్రమాదం: యాక్సిడెంట్‌‌కు కారణమిదే..!

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా...

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు బస్సు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే యాక్సిడెంట్