జిల్లాల ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం భేటీ.. ఆలస్యంగా వచ్చిన కలెక్టర్లు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 12, Sep 2018, 12:02 PM IST
Elecetion commission of india representatives conference with telangana district colletctors
Highlights

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఎన్నికల నిర్వహిణ, సిబ్బంది, ఈవీఎంల వినియోగం, శాంతిభద్రతలు తదితర అంశాలపై ఇవాళ జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైంది

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఎన్నికల నిర్వహిణ, సిబ్బంది, ఈవీఎంల వినియోగం, శాంతిభద్రతలు తదితర అంశాలపై ఇవాళ జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైంది.

ఖైరతాబాద్ జలమండలిలో ఉమేశ్ సిన్హా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి 31 జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు ఇతర అధికారులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి పలువురు కలెక్టర్లు ఆలస్యంగా రావడంతో సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఆలస్యంగా వచ్చారంటూ మండిపడ్డారు. రాజీవ్ హనుమంతు, దివ్య, శ్వేతా మహంతి, భారతి హోలికేరి, అమయ్ కుమార్ ఆలస్యంగా వచ్చిన వారిలో ఉన్నారు.

loader