జగిత్యాల: డ్రైవర్ తప్పిదవం వల్లే  కొండగట్టు వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకొందని జగిత్యాల ఆర్టీసీ డీపో మేనేజర్  అభిప్రాయపడుతున్నారు. కొండగట్టు వద్ద మంగళవారం నాడు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. బస్సులో సుమారు 62 మంది ఉన్నారని  కండక్టర్ వద్ద ఎస్ఆర్ ను బట్టి తెలుస్తోంది.

కొండగట్టుకు బస్సు చేరుకోకముందే  రెండు స్టేజీల వద్ద  సుమారు సుమారు 50 మందికి పైగా బస్సులో ఎక్కారు. అయితే కండక్టర్ టిక్కెట్లు ఇస్తున్న సమయంలోనే  ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

శనివారపేట నుండి బస్సు బయలుదేరిన కొద్దిసమయంలోనే ఈ బస్సు ప్రమాదానికి గురైంది.  శనివారపేట నుండి జగిత్యాలకు  షటిల్  సర్వీసు బస్సు ఇది. అయితే ఈ బస్సును కొండగట్టు మీదుగా  మళ్లించారు. 

నిజానికి ఈ బస్సు ఫిట్‌నెస్‌తో ఉందా లేదా అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  అయితే  ఈ బస్సు డ్రైవర్ ఘాట్ రోడ్డు నుండి  కిందకు దిగుతుండగా ఘాట్ రోడ్డుకు ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి లోయలోకి నాలుగు పల్టీలు కొడుతూ పడిపోయింది.

అయితే ఈ ప్రాంతానికి  బస్సు డ్రైవర్ కొత్త అని ఆర్టీసీ డిపో మేనేజర్  చెబుతున్నారు.  డ్రైవర్  నిర్లక్ష్యంగా ఈ బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందనే అభిప్రాయాలు లేకపోలేదు.

ఈ వార్త చదవండి

 

కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా: 43 మంది మృతి

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు