జగిత్యాల: కొండగట్టు బస్సు  ప్రమాదంలో  43 మంది మృతి చెందడం విషాదకరమైన ఘటన. అయితే బస్సులో  పరిమితికి మించి ప్రయాణీకులు ఉండడం వల్లే  ప్రమాదానికి ప్రధాన కారణంగా మారిందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమయ్యాయి.

మంగళవారం నాడు జగిత్యాల ఆర్టీసీ బస్సులో  మోతాదుకు మించి ప్రయాణీకులు ఉండడం వల్ల ప్రమాదానికి కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. బస్సులో సుమారు 62 మందికి ప్రయాణీకులు ఉన్నారని సమాచారం.

బస్సు ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్ వద్దకు చేరుకోగానే బస్సు  అదుపుతప్పింది. ఘాట్ రోడ్డు నుండి బస్సు కిందకు దిగుతున్న సమయంలోనే స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పింది.

ఆ సమయంలోనే ప్రయాణీకులు  డ్రైవర్ వైపుకు ఒరిగిపోయినట్టు చెబుతున్నారు. దీంతో  బస్సును కంట్రోల్ కాలేదు.  దీంతో రోడ్డుకు చివరన ఉన్న రెయిలింగ్ ను ఢీకొట్టి లోయలో పడిపోయింది.  ఈ లోయలోకి నాలుగు పల్టీలు కొడుతూ బస్సు పడిపోయింది.

ఈ సమయంలోనే బస్సులో వెనుక కూర్చొన్న ప్రయాణీకులు ముందువైపుకు చొచ్చుకొని వచ్చి ఒకరిపై మరోకరుపడిపోయారు. దీంతో ఊపిరాడకే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు.

డ్రైవర్ తాగి ఉన్నాడని అనుమానిస్తున్నారు. రెగ్యూలర్ రూట్ లో కాకుండా షార్ట్ కట్ రూటులో బస్సును తీసుకుని వచ్చినట్లు చెబుతున్నారు. డౌన్ కావడంతో న్యూట్రల్ లో వేసుకుని బస్సును నడిపాడని, అతి వేగం వల్ల బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద ఎగిరి రెయిలింగ్ ఢీకొట్టి లోయలోకి పడిపోయిందని అంటున్నారు. 

ఈ వార్తలు చదవండి

కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా: 43 మంది మృతి

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?
కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహాదారిపైకి.. ఇంతలోనే ఇలా..