Asianet News TeluguAsianet News Telugu

పుదుచ్చేరిలో హైదరాబాద్ స్టూడెంట్ పై రేప్.. ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్ కు చెందిన వైద్య విద్యార్థిణిపై పుదుచ్చేరిలో అత్యాచారం జరిగింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఓ కానిస్టేబుల్ ను, అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. 

Rape of Hyderabad student in Puducherry.. Two arrested
Author
First Published Sep 6, 2022, 10:15 AM IST

ఆడ‌పిల్ల‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. అత్యాచారాల‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వాలు అనేక చ‌ట్టాలు తీసుకొచ్చాయి. క‌ఠిన శిక్షలు అమ‌లు చేస్తున్నాయి. అయినా మ‌హిళ‌పై దారుణాలు కొన‌సాగుతున్నాయి. నిత్యం ఎక్క‌డో ఒక చోట మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల ఘ‌ట‌న‌లు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైద‌రాబాద్ కు చెందిన విద్యార్థినిపై పుదుచ్చేరిలో రేప్ జ‌రిగింది. ఈ ఘట‌న‌లో ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం: హైద్రాబాద్ సహా దేశంలోని పలు చోట్ల ఈడీ సోదాలు

వివ‌రాలు ఇలా ఉన్నాయి. పుదుచ్చేరిలో ఉన్న జవహర్‌లాల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ లో ఏర్పాటు చేసిన ఓ స‌ద‌స్సులో పాల్గొనేందుకు హైద‌రాబాద్ కు చెందిన 20 సంవత్స‌రాల మెడిసిన్ స్టూడెంట్ వ‌చ్చింది. అయితే ఆమె ఆ యూనివ‌ర్సిటీ లో ఉన్న ఓ ఆడిటోరియం వ‌ద్ద గురువారం రాత్రి స‌మ‌యంలో వాకింగ్ చేస్తోంది. ఈ స‌మ‌యంలో ఆ  కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 31 సంవ‌త్స‌రాల కానిస్టేబుల్ క‌న్న‌న్ బైక్ పై వ‌చ్చాడు. అత‌డి వెంట ఫ్రెండ్ శివ కూడా ఉన్నాడు. వీరిద్ద‌రూ క‌లిసి మెడిసిన్ స్టూడెంట్ ను రేప్ చేశారు.

నేను చెప్పేది హైదరాబాద్‌లోని ఫ్రెండ్స్‌కు నచ్చకపోవచ్చు: బెంగళూరులో వరదలపై కేటీఆర్ 

దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్ర‌యించింది. త‌న‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని వివ‌రిస్తూ పోలీసుల‌కు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ల‌ను ఆధారంగా ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల‌ను గుర్తించారు. అనంత‌రం సోమ‌వారం అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios