తెలంగాణలో రిచ్చెస్ట్ ఎంపీ అభ్యర్థి ఆయనే? అన్నివేల కోట్ల ఆస్తులే..! 

తెలంగాణలో అత్యంత ధనిక, అతి పేద ఎంపీ అభ్యర్ధులు బిజెపికి చెందినవారే. ఒకాయన వేల కోట్ల ఆస్తిపాస్తులు కలిగివుంటే మరొో యువ నాయకుడు కేవలం కోటి రూపాయల ఆస్తులు కలిగివున్నాడు... వాళ్లు ఎవరంటే...

Konda Vishweshwar Reddy Is The Richest MP Candidate in Telangana AKP

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా మరికొన్నిరాష్ట్రాల్లో త్వరలోనే జరగనున్నాయి. ఇలా తెలంగాణలో కూడా నాలుగో విడతలో అంటే మే 13న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసిన ముమ్మరం ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో అభ్యర్థులకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అభ్యర్థులు నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అందించిన పత్రాలు ఈసి అధికారిక వెబ్ సైట్ లో వుండటంతో పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. 

ఓ నియోజకవర్గంలో ఇద్దరు శ్రీమంతుల మధ్య పోటీవుంటే మరో నియోజకవర్గంలో కేవలం కేవలం కోటిరూపాయల ఆస్తులు కలిగినవారు పోటీ పడుతున్నారు. గతంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్, మాజీ ఐఎఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ వంటివాళ్ల ఆస్తులు కోటి రెండుకోటుగానే చూపించారు. ఇంకొందరు అభ్యర్థులయితే వందలు, వేలకోట్ల ఆస్తులు చూపించారు. కాబట్టి తెలంగాణ  లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నవారిలో అత్యంత ధనవంతులు, అతి తక్కువ ఆస్తులు కలిగివున్నవారు ఎవరో తెలుసుకుందాం. 

రిచ్చెస్ట్ ఎంపీ అభ్యర్థి : 

ముందుగా అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థి విషయానికి వస్తే... గొప్ప రాజకీయ కుటుంబం నుండి వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి టాప్ లో వున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తొలి డిప్యూటీ సీఎం కెవీ రంగారెడ్డి మనవడే ఈ విశ్వేశ్వర్ రెడ్డి. చాలాకాలం   విదేశాల్లో పనిచేసిన ఈయన తాత వారసత్వాన్ని పునికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 

మొదటిసారి భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి చేవెళ్ల లోక్ సభకు పోటీచేసి గెలిచారు విశ్వేశ్వర్ రెడ్డి. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం బిజెపిలో చేరి ప్రస్తుతం చేవెళ్ల బరిలో నిలిచారు. ఇటీవల నామినేషన్ వేసిన ఆయన తన ఆస్తిపాస్తులు రూ.4,568 కోట్లుగా చూపించారు. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం... అతడి పేరుమీద వున్న చరాస్తులు రూ.1,178 కోట్లు. ఆయన భార్య  అపోలో హాస్పిటల్స్  వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీత రెడ్డి. ఆమె పేరిట రూ.3,203 కోట్ల ఆస్తులు వున్నాయి. ఇక తనయుడు విరాజ్ మాధవ రెడ్డి పేరిట రూ.107 కోట్ల  ఆస్తులు వున్నట్లు విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. 

ఇక స్థిరాస్థుల విషయానికి వస్తే... విశ్వేశ్వరరెడ్డి పేరిట రూ.71 కోట్లకు పైగా విలువచేసే ఆస్తులు వున్నాయి.  భార్య సంగీత రెడ్డి పేరిట రూ.5 కోట్లకు పైగా, కొడుకు విరాజ్ రెడ్డి పేరిట కోటి రూపాయలకు పైగా స్థిరాస్తులు వున్నారు. మొత్తంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు, కుమారుడి పేరిట రూ.4,568 కోట్లకు పైగా ఆస్తులు వున్నాయి. 

పూరెస్ట్ ఎంపీ అభ్యర్థి :

ఇక ప్రధాన పార్టీల అభ్యర్ధుల్లో అతి తక్కువ ఆస్తులు కలిగివున్నది కూడా బిజెపి నాయకుడే. ఇటీవలే బిఆర్ఎస్ నుండి బిజెపిలో చేరిన నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు ఈసారి తనయుడిని బరిలోకి దింపారు. ఇలా నాగర్ కర్నూల్ బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన భరత్ ప్రసాద్ తన ఆస్తులవిలువ కేవలం రూ.33 లక్షలుగా పేర్కొన్నారు.  

ఇదే నాగర్ కర్నూల్ బిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఐఎఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అతి తక్కువగా ఆస్తులు కలిగివున్నాడు. అతడు తన కుటుంబ ఆస్తులను రూ.1.41 కోట్లుగా చూపించారు. ఆయనకు రూ.51.80 లక్షల అప్పులు కూడా వున్నాయట. 

ఇక ఇదే బిజెపి అభ్యర్థి, ఆ పార్టీ మాజీ రాష్ట్రాధ్యక్షులు బండి సంజయ్ ఆస్తులు కేవలం కోటి రూపాయల పైచిలుకు మాత్రమేనట. ఆసక్తికర విషయం ఏమిటంటే కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా వున్న ఆయనకు సొంత ఇళ్లుగానీ, ఇతర స్థిరాస్తులు గానీ లేవట. కోటి రూపాయలు విలువచేసే మూడు కార్లు, రెండు బైక్స్ చరాస్తులుగా వున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios