ఢిల్లీ లిక్కర్ స్కాం: హైద్రాబాద్ సహా దేశంలోని పలు చోట్ల ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దేశ వ్యాప్తంగా ఈడీ అధికారులు మంగళవారం నాడు సోదాలు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏక కాలంలోనే సోదాలు చేశారు. హైద్రాబాద్ లో ఆరు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో దేశ వ్యాప్తంగా ఈడీ అధికారులు మంగళవారం నాడు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ, లక్నో, బెంగుళూరు, చెన్నై, హైద్రాబాద్ తదితర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు..హైద్రాబాద్ లో ఆరు చోట్ల ఏక కాలంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రామచంద్రన్ పిళ్లైకి చెందిన సంస్థలతో పాటు నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాబిన్ డిస్టిలర్స్ పేరుతో రామచంద్రన్ పిళ్లై వ్యాపారం చేస్తున్నారు. బెంగుళూరుతో పాటు హైద్రాబాద్ లో వ్యాపారం చేస్తున్నారు పిళ్లై. డిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఈడీ అధికారులు పిళ్లై నివాసాల్లో సోదాలు చేస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది.రామచంద్రన్ పిళ్లైతో పాటు అబిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్ రావు,సృజన్ రెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా ఈ కథనం తెలిపింది.
ఢిల్లీ లిక్కకర్ స్కాంలో సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం రాజకీయంగా ఆప్ , బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలోని కొందరికి సంబంధం ఉందని బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ స్కాంలో ఎవరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వలేని సీబీఐ నిన్న ప్రకటించింది. ఇవాళ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసిన ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ఏడాది జూలై మాసంలో ఈ పాలసీ ఆప్ సర్కార్ రద్దు చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం పై 11 పేజీలతో సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఢిల్లీ డిప్యూటీసీఎం మనీష్ సిసోడియా, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఆర్య గోపి కృష్ణ, రామచంద్రన్ పిళ్లై వంటి వారి పేర్లను సీబీఐ చేర్చించింది.