కేసీఆర్‌కు ఈసీ షాక్.. ఎన్నికల ప్రచారంపై నిషేధం.. అసలేం జరిగింది?
K Chandrashekar Rao: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది.
K Chandrashekar Rao: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఏప్రిల్ 5 వ తేదీన సిరిసిల్లలో పర్యటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం.. కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు అంటే ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఆయన ప్రచారాన్ని దూరంగా కానున్నారు. సిరిసిల్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
అసలేం జరిగింది?
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఏప్రిల్ 5 వ తేదీన సిరిసిల్లలో పర్యటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టింది. కానీ, కేసీఆర్ వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల సంఘం.. చివరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది.
ఈ నిషేధం మే 1 వ తేదీ నుంచి అంటే.. ఇవాళ రాత్రి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. మే ఒకటో తేదీ రాత్రి 8 గంటల నుంచి మే మూడో తేదీ రాత్రి 8 గంటల వరకూ నిషేధం అమల్లో ఉండనున్నది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనావళి అమల్లో ఉన్న తరుణంలో కేసీఆర్ వ్యాఖ్యలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.