Asianet News TeluguAsianet News Telugu

సినీ నిర్మాత కారు చోరీ, 56 కార్లు చోరీ : దమ్ముంటే పట్టుకోండంటూ పోలీసులకు సవాల్

‘సార్ నమస్తే మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు.  హైదరాబాద్  నుంచి ఫలానా ట్రైన్ లో వచ్చారు. మా రాష్ట్రంలో ఫలానా చోట దిగి.. ఆరా తీస్తూ నా ఆచూకీ గుర్తించారు. ఇందుకోసం మీరు చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్. కానీ, నేను చిక్కుతానని నమ్మకం పెట్టుకోవద్దు.  నేను కొట్టేసిన కారు ఆచూకీ కూడా.. నేను దయతలచి చెబితే తప్ప మీరు తెలుసుకోలేరు.

producer car theft:  thief challenged the police to catch him if they have the guts - bsb
Author
Hyderabad, First Published Jun 10, 2021, 1:54 PM IST

‘సార్ నమస్తే మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు.  హైదరాబాద్  నుంచి ఫలానా ట్రైన్ లో వచ్చారు. మా రాష్ట్రంలో ఫలానా చోట దిగి.. ఆరా తీస్తూ నా ఆచూకీ గుర్తించారు. ఇందుకోసం మీరు చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్. కానీ, నేను చిక్కుతానని నమ్మకం పెట్టుకోవద్దు.  నేను కొట్టేసిన కారు ఆచూకీ కూడా.. నేను దయతలచి చెబితే తప్ప మీరు తెలుసుకోలేరు.

ఎలాగూ ఇంతదూరం వచ్చారు.   మీరున్న చోటుకి కొద్ది దూరంలో మాంచి హోటల్ ఉంది. ఫుడ్ మస్తు గా ఉంటది.  చక్కగా లాగించి వెళ్ళండి.  మిమ్మల్ని మా అతిథులు గా భావించి బిల్లు కూడా నేనే కడతా…’ ఓ నిర్మాత కారు చోరీ కేసులో ఆరా తీస్తూ రాజస్థాన్కు వెళ్లిన పోలీసులకు ఓ దొంగోడు ఇచ్చిన ఝలక్ ఇది. 

అంతేనా ‘నా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి.. నా అంతట నేను దొరికిపోవాలని అనుకుంటే తప్ప.. మీరు దండం పెట్టి వేడుకున్నా నేను దొరకను’  అంటూ మరో పోలీస్ అధికారి కి వీడియో కాల్ చేసి  కాలర్ ఎగరేశాడు. కారు కూడా తనకు నచ్చినన్నాళ్లు వాడుకుని.. ఎక్కడో ఒకచోట వదిలేస్తానని, అప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. దీంతో ఎన్నో క్లిష్టమైన కేసులను సైతం ఛేదించిన రికార్డు ఉన్న బంజారాహిల్స్ పోలీసులే.. ఏం చేయలేక రెండు నెలలుగా తమ ప్రయత్నాలు మానుకున్నారు. ఆ నేరగాడు దొరికినప్పుడే చూద్దాంలే అని ధోరణిలో పడ్డారు.

ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య... వారం రోజులుగా చెట్టుకు వేలాడుతూనే...

నిందితుడిది రాజస్థాన్ అని దర్యాప్తులో గుర్తించిన పోలీసులు.. అతడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్లి, నాలుగు రోజుల పాటు అష్టకష్టాలూ పడి అతని ఇంటి ఆచూకీ తెలుసుకున్నారు.ఇక్కడ ఆరా తీయగా దేశవ్యాప్తంగా అతడిపై 56 కార్ల చోరీ కేసులు ఉన్నాయని, ఒక్కసారి కూడా పోలీసులకు  పట్టు పడలేదని తెలిసింది.

మరోవైపు పోలీసులు అక్కడ ఉండగానే నిందితుడు వారికి ఫోన్ చేసి షాక్ ఇచ్చాడు. రాజస్థాన్ లో వారు ఎక్కడ ఎక్కడ బస చేసింది.. తన ఆచూకీ కోసం ఎవరెవరిని కలిసింది..  అన్నింటిని పూసగుచ్చినట్టు చెప్పాడు. ఎంత కష్టపడ్డా నాన్ను దొరికేది లేదని.. స్థానికంగా ఉన్న రెస్టారెంట్ లో మంచి ఆహారం తిని తిరిగి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చాడు. నిందితుడి కోసం పదిహేను రోజులపాటు గాలించిన పోలీసులు ఆ కాల్ తర్వాత ఉత్త చేతులతో తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు.

వారు వచ్చిన రెండు రోజులకు సదరు దొంగ ఇక్కడి పోలీస్ అధికారికి వాట్సాప్ వీడియో కాల్ చేసి గంట సేపు మాట్లాడాడు. ‘నేను మరో సారి కనిపించను. నా ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోండి.. అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు’ కార్ల చోరీలో తాను అనుసరిస్తున్న స్టైల్ వల్లనే తప్పించుకోగలుగుతున్నానని చెప్పాడు. తనను వెతుక్కుంటూ వచ్చిన వారిలో బంజారాహిల్స్ పోలీసులు మొదటి వరుసలో ఉన్నారు అని ప్రశంసించాడు.

కారు పోగొట్టుకున్న నిర్మాత ఏమో తన కారు పోయినా పర్వాలేదు.. గానీ స్థలాల పత్రాలను ఇప్పించాలని వేడుకుంటున్నాడు.  కానీ పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.

దారుణం : తీసుకున్న డబ్బు అడిగిందని... చంపి సెప్టిక్ ట్యాంక్ లో పడేసి......

అసలేం జరిగిందంటే... బెంగళూరుకు చెందిన మంజునాథ్ సినీ నిర్మాత, వ్యాపారవేత్త, పని నిమిత్తం ఫార్చునర్ కార్ లో జనవరి 22న హైదరాబాద్కు వచ్చారు. బంజారాహిల్స్ లోని అత్యంత ఖరీదైన హోటళ్లలో బస చేశారు.  26న పని ముగించుకుని  హోటల్ కు తిరిగి వచ్చాడు. మర్నాడు పార్కింగ్ వద్దకు వెళ్ళి చూసేసరికి కారు అక్కడ లేదు. 

కారు లో బంగారు గణపతి విగ్రహంతో పాటు పలు స్థలాల తాలూకు డాక్యుమెంట్లు కూడా ఉండడంతో మంజునాథ్ పోలీసులను ఆశ్రయించాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పార్క్ హయత్ తోపాటు బంజారాహిల్స్ లోని అన్ని సీసీ కెమెరాల్లో పరిశీలించారు.  దొంగ సాంకేతిక సహాయంతో కారు తాళం తీసి చోరీ చేసినట్టుగా నిర్ధారణకు వచ్చారు.

సెల్ఫోన్లో ఓ యాప్ తో పాటు కొన్ని పరికరాలను దొంగ ఉపయోగించినట్టు తేలింది.  చోరీ జరిగిన రెండు రోజుల తర్వాత టోల్ గేట్ నుంచి కారు బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కూకట్పల్లిలో కారు రెండు రోజులపాటు నిలిపి ఉంచినట్టు పోలీసులు తనను అనుసరించడం లేదని తేలాక కారుతో సహా పారిపోయినట్టు గా గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios