నల్లగొండ: ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ లభించింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, వారు వరంగల్ కేంద్ర కారాగారం నుంచి బయటపడే అవకాశం లేదు. వారిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడంతో బెయిల్ లభించినా వారు జైలులో ఉండాల్సి వస్తోంది.

ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శనివారంనాడు బెయిల్ మంజూరైంది. తన కూతురు కులాంతర వివాహంపై ఆగ్రహించిన మామ మారుతీరావు ఆదేశాల మేరకు దుండగులు ప్రణయ్ ను హత్య చేశారు. 

పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో వారికి బెయిల్ లభించినట్లు తనకు తెలిసిందని, కేసు నమోదు చేయడానికి కొంత సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారని, తమ ప్రాణాలకు మారుతీ రావు నుంచి, ఇతరుల నుంచి ముప్పు ఉందని తాము న్యాయమూర్తి చెప్పామని ప్రణయ్ తండ్రి బాలస్వామి అంటున్నారు. 

90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయకపోతే ఏ కేసులోనైనా నిందితులకు బెయిల్ లబిస్తుందని నల్లగొండ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ గౌడ్ చెబుతున్నారు. వారికి బెయిల్ మాత్రమే లభించిందని, కానీ ఇప్పటికీ జైలులోనే ఉన్నారని మిర్యాలగుడా డిఎస్పీ శ్రీనివాస్ అన్నారు. 

నిందితులు మొబైల్ కాల్ లాగ్ ను తొలగించడంతో తాము ఫోరెన్సిక్ నివేదిక కోసం నిరీక్షిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులు వాటిని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, జనవరి మొదటి వారంలో తమకు నివేదిక రావచ్చునని ఆయన అంటున్నారు.

సంబంధిత వార్తలు

ప్రణయ్ హత్య కేసు.. అమృత తల్లి మైండ్ గేమ్..?

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్: మారుతీరావు, శ్రవణ్‌ల ఇళ్లలో పోలీసుల సోదాలు

ప్రణయ్ విగ్రహం... మారుతీరావుకి మద్దతుగా భారీ ర్యాలీ

అది పరువుహత్యే అయితే మారుతీరావు బతకొద్దు.. వర్మ కామెంట్స్!

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

అమృతను కాపాడేందుకే ఆ అబద్దం చెప్పా: డాక్టర్ జ్యోతి

ప్రణయ్ హత్య: మారుతీరావుపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?