మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా అమృత తండ్రి మారుతిరావు.. ప్రణయ్ ని హత్య చేయించారు.

ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే టాపిక్.. సోషల్ మీడియా, టీవీ చానళ్లు, వార్తా పత్రికల్లో ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ హత్యను ఖండిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై స్పందించారు. ''అమృత తండ్రి మారుతీరావు క్రూరుడైన క్రిమినల్. ప్రణయ్ ని హత్య చేసి ఆ కీర్తి ప్రతిష్టలను అతడు ఏం చేసుకోలేడు. ఒకవేళ అతను పరువుకోసమే హత్య చేసినట్లయితే.. అతను కూడా చావడానికి సిద్ధంగా ఉండాలి. నిజమైన పరువు హత్య అంటే పరువు కోసం హత్య చేసేవారిని హత్య చేయడమే'' అంటూ రాసుకొచ్చాడు.