మిర్యాలగూడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు విచారణను పోలీస్‌ యంత్రాంగం వేగవంతం చేసింది. హత్య కేసును అన్ని కోణాల్లో విచారించేందుకు ఈ నెల 5వరకు నిందితులను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.

అందులో భాగంగా ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌కుమార్‌లను పోలీస్‌ బందోబస్తు నడుమ మంగళవారం మిర్యాలగూడకు తీసుకొచ్చారు. డీఎస్పీ పి. శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బృందాలు ఇరువురి ఇళ్ల తాళాలను తెరిపించి ప్రత్యేక తనిఖీలు జరిపాయి. 

ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన పలు కీలక ఆధారాలతో పాటు మరికొన్ని విలువైన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇళ్లలో సోదాలు ముగిసిన అనంతరం ఇద్దరు నిందితులని విచారణ నిమిత్తం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు.

ఈ వార్తలు కూడా చదవండి

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు