Asianet News TeluguAsianet News Telugu

మహేష్ బ్యాంక్‌లో సైబర్ దోపిడీ.. వెలుగులోకి కీలక విషయాలు.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకన్న పోలీసులు..

ఆంధ్రప్రదేశ్ మహేష్ బ్యాక్ కో ఆపరేటివ్‌ బ్యాంక్ (Andhra Pradesh Mahesh Cooperative Bank) ప్రధాన సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 12.9 కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

Police speed up investigation in Mahesh Bank server hack key things come into light
Author
Hyderabad, First Published Jan 27, 2022, 11:55 AM IST

ఆంధ్రప్రదేశ్ మహేష్ బ్యాక్ కో ఆపరేటివ్‌ బ్యాంక్ (Andhra Pradesh Mahesh Cooperative Bank) ప్రధాన సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 12.9 కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత బ్యాంక్‌లోని మూడు అంకౌంట్లకు డబ్బులు తరలించిన నేరగాళ్లు.. దానిని ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 128 ఖాతాలకు బదిలీ చేశారు. ఈ క్రమంలోనే ఆ మూడు బ్యాంకకు ఖాతాల యజమానుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ మూడు అకౌంట్‌ల విషయానికి వస్తే అవి.. శాన్విక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హిందుస్తాన్‌ ట్రేడర్స్‌, షానవాజ్‌ బేగం పేర్లతో ఉన్నాయి. ఈ ఖాతాలను వివిధ బ్రాంచ్‌లో తెరిచారు. 

అయితే ఇందుకు సంబంధించి హుస్సేనిఆలంకు చెందిన వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. హిందూస్తాన్ ట్రేడర్స్ పేరుతో మహేష్ బ్యాంకులో వినోద్ అకౌంట్ తెరిచారు. ఈ బ్యాంక్‌ అకౌంట్ ద్వారానే వివిధ ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారు. ఇక, నేరానికి పాల్పడిన అనంతరం బ్యాంకు సర్వర్‌లో ఆధారాలను కేటుగాళ్లు తొలగించారు. బ్యాంక్ సర్వర్లను 18 గంటల పాటు వారి ఆధీనంలో ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, ముంబైకి చెందిన ఓ మహిళతో సైబర్‌ నేరగాళ్లు మహేష్‌ బ్యాంక్‌‌లో ఖాతా తెరిపించారు. ఈ పనికి హుస్సెనీఆలంలోని ఓ వ్యాపారవేత్తను ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ అకౌంట్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్ అందుబాటులో లేకుండా పోయింది. ఈ సైబర్ చోరికి పాల్పడక ముందు నేరగాళ్లు.. మూడు ఖాతాలు ఉన్న బ్యాంక్ శాఖలకు వెళ్లి పరిస్థితులను గమనించి ఉంటాడని అనుమానిస్తున్నారు. 

మహేష్ బ్యాంక్ సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ సంస్థ నిర్వహిస్తుండగా.. సాఫ్ట్‌వేర్‌ను ముంబైకి చెందిన సంస్థ అందించింది. ప్రాక్సీ సర్వర్‌తో సైబర్ నేరగాళ్లు సర్వర్‌ను యాక్సెస్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నేరం చేయడానికి ముందు సైబర్ నేరగాళ్లు.. చెస్ట్ ఖాతాను యాక్సిస్ చేసి ఈ మూడు ఖాతాల లావాదేవీల పరిమితిని రూ. 50 కోట్లకు పెంచేశారు. సైబర్ నేరగాళ్లు.. డైరెక్ట్‌గా సర్వర్‌ను హ్యాక్ చేశారా..? లేదా బ్యాంక్ సాఫ్ట్‌వేర్ లోకి ప్రవేశించి సర్వర్‌ను హ్యాక్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఐపీ ఆడ్రస్ ప్రకారం అమెరికా, కెనడా నుంచి ఈ ఆపరేషన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

గతేడాది జూలైలో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌ (Telangana State Cooperative Apex Bank) కోర్ బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు రూ. 1.96 కోట్లు స్వాహా చేశారు. తాజాగా మహేష్ బ్యాంక్‌లో చోటుచేసున్న చోరి కూడా.. ఆ ఘటనను పోలి ఉంది. మొదట కోర్ ఖాతా నుంచి ఖాతాదారుల ఖాతాలకు నిధులను తరలించి.. అక్కడి నుంచి వివిధ బ్యాంక్ ఖాతాలను డబ్బులు బదిలీ చేశారు. గతంలో సర్వర్లు హ్యాక్ అయిన 2 బ్యాంకులకు సాఫ్ట్‌వేర్ అందించిన సంస్థే.. మహేష్ బ్యాంకుకు సాఫ్ట్‌వేర్ అందించడంతో.. సర్వర్‌ హ్యాక్‌ చేసి నగదు కొల్లగొట్టిన నేరస్థుడు ఒక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios