Asianet News Telugu

ఎక్స్ టార్షన్ గ్యాంగ్ : అమ్మాయిల పేరుతో వల, నగ్నంగా తయారై వీడియోలు.. రూ. 89లక్షలకు టోకరా..

ఆన్లైన్లో అశ్లీలం తో ఎరవేసి బెదిరిస్తూ అందినకాడికి వసూలుచేసే ఎక్స్‌టార్షన్‌ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.  రాజస్థాన్ లోని  మేవాట్‌ రీజియన్‌కు చెందిన 11 మంది నిందితులను ఇటీవల అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో ఈ ముఠాపై హైదరాబాద్ లో పది కేసులు నమోదైనట్టు వెలుగులోకి వచ్చింది.
 

police bust gang involved in extortion - bsb
Author
Hyderabad, First Published Jun 28, 2021, 3:56 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆన్లైన్లో అశ్లీలం తో ఎరవేసి బెదిరిస్తూ అందినకాడికి వసూలుచేసే ఎక్స్‌టార్షన్‌ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.  రాజస్థాన్ లోని  మేవాట్‌ రీజియన్‌కు చెందిన 11 మంది నిందితులను ఇటీవల అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో ఈ ముఠాపై హైదరాబాద్ లో పది కేసులు నమోదైనట్టు వెలుగులోకి వచ్చింది.

దీనిపై సమాచారం అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ వారిపై న్యాయస్థానం నుంచి న్యాయస్థానం నుంచి ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్లు తీసుకున్నారు. ఈ వారెంట్ల ఆధారంగా  వారిని ఇక్కడికి తీసుకు వస్తున్నారు. రాజస్థాన్ లోని మేవాట్‌ రీజియన్‌లో ఉండే ఆల్వార్,  భరత్పూర్,  మథుర ప్రాంతాలకు చెందిన  11 మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు అల్వార్, భరత్ పూర్ లో షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు.

నకిలీ వివరాలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన ఆకర్షణీయమైన మహిళల ఫోటోలతో ఫేస్బుక్ లో ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ఈ ప్రొఫైల్ ద్వారా ఫేస్బుక్ లో ఉన్న అనేకమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపిస్తున్నారు. వీటిని యాక్సెప్ట్ చేసి ఫ్రెండ్స్ గా మారిన వాళ్లతో సైబర్ నేరగాళ్లు కొన్నాళ్లపాటు సదరు యువతి మాదిరిగానే మెసెంజర్ లో చాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్స్ ఇచ్చేలా చేస్తున్నారు.

ఇంటర్నెట్ నుంచి దొంగిలించిన అర్థనగ్న, నగ్న వీడియోలను సైబర్ నేరగాళ్లు ప్రత్యేక యాప్ ద్వారా తమ ఫోన్లో నుంచి టార్గెట్ చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ తామే నగ్నంగా తయారవుతున్న అంటూ ఆ యాప్లోని వీడియోలు ప్లే చేస్తున్నారు. దీంతో పూర్తిగా తమ వలలో పడిపోతున్న బాధితులను సైబర్ నేరగాళ్లు అనేకరకాలైన మాయ మాటలు చెబుతూ తాము చెప్పినట్లు చేసేలా చేస్తున్నారు.

ఒకరి భర్తతో.. మరొకరి భార్య పరార్..! పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఆ ఇద్దరు...!!...

ఇలా సేకరించిన వ్యక్తిగత వీడియోలను యూ ట్యూబ్ ఛానల్స్ లో పెడుతున్నారు. ఆ లింకులను బాధితులకు వాట్స్ అప్ చేసి తాము కోరిన మొత్తం చెల్లిస్తేనే వీటిని తొలగిస్తామని, లేదంటే ఇతర సోషల్ మీడియాలో పెట్టేస్తామంటూ నేరగాళ్లు బెదిరిస్తున్నారు. ఇలా అందినకాడికి పేటీఎం, గూగుల్ పే, బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు.

ఆ పై పోలీసుల మాదిరిగా బాధితులకు కాల్ చేస్తూ మరో అంకానికి తెర లేపుతున్నారు. ఇలా రాజస్థాన్లోని అల్వార్‌ ప్రాంతానికి చెందిన వారిని ఈ గ్యాంగ్ వేధించింది.  వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 11 మందిని పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన పది మంది నుంచి రూ. 89 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. ఈ మేరకు కూడా కేసులు ఉండడంతో ఒకటి రెండు రోజుల్లో సిటీకి తీసుకురానున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios