హైదరాబాద్: తనపై 139 మంది రేప్ చేశారని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది.

మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ ఫిర్యాదు చేసిన వారిపై పోలీసులు నిర్భయ కేసు  నమోదు చేశారు.రాజకీయ నేతల పీఏలు, సినీ ప్రముఖులపై మహిళ ఫిర్యాదు చేసింది.  సోమాజీగూడలోని ఓ ఎన్జీవో సంస్థలో ప్రస్తుతం ఆ మహిళ ఆశ్రయం పొందుతోంది.

బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  139 మందిలో ప్రముఖులు ఉండడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేయనున్నట్టుగా పోలీసులు  చెబుతున్నారు.

రాజకీయ నాయకులు పీఏలు, సినీ ప్రముఖులతో ఆమెకు ఎలా పరిచయం ఏర్పడైందనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. 

మహిళలపై ఇటీవల కాలంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.