వరదలో చిక్కుకున్న టూరిస్ట్ బస్సు: తృటిలో తప్పిన పెను ప్రమాదం

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 12, Aug 2018, 4:02 PM IST
narrowly escaped tourists from flood in Bhupalpally district
Highlights

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ వద్ద ఆదివారం నాడు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. వాగులో చిక్కుకొన్న ప్రైవేట్ టూరిస్టు బస్సును స్థానికులు తాడుతో లాగడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది.


భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ వద్ద ఆదివారం నాడు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. వాగులో చిక్కుకొన్న ప్రైవేట్ టూరిస్టు బస్సును స్థానికులు తాడుతో లాగడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీని  సందర్వించేందుకు కొందరు టూరిస్టులు వచ్చారు. బ్యారేజీ పనులు సందర్శించి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

చుండ్రుపల్లి వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది.అయితే ఈ వాగును దాటొచ్చనే ఉద్దేశ్యంతో డ్రైవర్ బస్సును అలానే ముందుకు నడిపాడు. అయితే వాగు ఉదృతికి బస్సు చిక్కుకుపోయింది. దీంతో స్థానికులు తాడు సహాయంతో బస్సును వాగు నుండి బయటకు లాగారు.

అన్నారం బ్యారేజీ నుండి కన్నెపల్లి పంపుహౌజ్ ను చూసేందుకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. 
 

loader