Asianet News TeluguAsianet News Telugu

వైరల్ ఆడియో.. వీఆర్వోని బూతులు తిట్టిన ఎమ్మెల్యే..

కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ మండల రెవెన్యూ అధికారులు, సిబ్బందిని పరుషపదజాలంతో తిట్టిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పేదోళ్ల ఇళ్లు కూలుస్తావా.. కరెంటు మీటర్లు ఇండ్లళ్లకెళ్లి తీస్క పోతవ్.. ఎవడిచ్చిండురా నీకు అధికారం అంటూ వీఆర్వో శ్యామ్ కుమార్ ను తిట్టిన ఆడియో బైటికి వచ్చింది. వివరాల్లోకి వెడితే...

mla kp vivekananda angry on vro audio viral
Author
Hyderabad, First Published Oct 5, 2020, 9:51 AM IST

కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ మండల రెవెన్యూ అధికారులు, సిబ్బందిని పరుషపదజాలంతో తిట్టిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పేదోళ్ల ఇళ్లు కూలుస్తావా.. కరెంటు మీటర్లు ఇండ్లళ్లకెళ్లి తీస్క పోతవ్.. ఎవడిచ్చిండురా నీకు అధికారం అంటూ వీఆర్వో శ్యామ్ కుమార్ ను తిట్టిన ఆడియో బైటికి వచ్చింది. వివరాల్లోకి వెడితే...

గాజులరామారం సర్వేనెంబర్‌ 79లో ప్రభుత్వ స్థలాన్ని కొన్నేళ్లుగా జగద్గిరి గుట్టకు చెందిన అధికార పార్టీ నేత అమ్ముతున్నాడు. అయితే ఇవి అక్రమ కట్టడాలను వీటిని కూల్చివేయాలని కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌కు జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు పోలీస్‌ సిబ్బంది సహకారంతో వీఆర్‌ఓ శ్యామ్‌కుమార్‌ 15 ఇళ్లను కూల్చివేసి కరెంటు మీటర్లను స్వాధీనం చేసుకున్నాడు. 

అయితే ముందస్లు నోటీసులు లేకుండా అధికారులు తమ ఇండ్లను కూల్చేశారని బాధితులు ఎమ్మెల్యే వివేకానందను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మాటలు విన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద వీఆర్‌ఓ శ్యామ్ కు ఫోన్‌ చేశారు. ఇళ్లను కడుతున్నప్పుడే ఆపాలి కదా.. అప్పుడు ఆపకుండా కరెంటు మీటర్లు కూడా ఒచ్చినంక కూల్చుడేంది.. ఇదేం న్యాయం..అంటూ పరుషపదజాలంతో దూషించాడు. దీంతో శ్యామ్‌కుమార్‌ బదులిస్తూ తహసీల్దార్‌, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కూల్చివేశానని అన్నాడు. 

ఓ దిక్కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల ఇళ్లకు రెగ్యులరైజేషన్‌ చేయాలని చూస్తుంటే, మీ రెవెన్యూ వారు బుద్ధ్ది మార్చుకోవడం లేదంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ కూల్చివేతలు చేస్తే తప్పా? మా ఇష్టానుసారంగా చేయలేదని వీఆర్‌ఓ శ్యామ్‌కుమార్‌ బదులిచ్చాడు. 

ఈ విషయంపై కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డిని వివరాలు కోరగా సర్వేనెంబర్‌ 79లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయమని తానే శ్యామ్‌ను పంపించానని తేల్చాడు. అంతేకాదు రాజకీయ నాయకులు ఎన్నిమాటలైనా అంటారు. ఇక్కడ ఉద్యోగం చేయడమంటే కష్టంగా ఉంది. ప్రజా ప్రతినిధులు అధికారులను దూషించడం ఎంత వరకు సబబు, ఈ విషయాన్ని కలెక్టర్‌, మా యూనియన్‌ దృష్టికి తీసుకెళ్లాం చెప్పుకొచ్చాడు. 

ఆడియో వైరల్ కావడం మీద వివేకానంద స్పందిస్తూ.. నా వద్దకు వచ్చిన బాధితుల్లో గర్భిణి కూడా ఉంది. తెల్లవారకముందే వారి ఇళ్లను కూల్చివేశారని చెప్పడంతో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్‌ఓ శ్యామ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయటం వాస్తవమేనని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. మానవత్వం లేకుండా దౌర్జన్యంగా ఇండ్లను కూల్చివేయడం సరికాదని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios