Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీలో శివానీ రాజశేఖర్‌ సినిమా.. తెలుగులో `సత్య`గా వస్తోన్న మరో సూపర్‌ హిట్‌ మూవీ

మరోసారి శివానీ రాజశేఖర్‌ మూవీ ఓటీటీలోనే రాబోతుంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అలాగే `సత్య` మూవీ ట్రైలర్‌ విడుదలైంది. 
 

Shivani Rajasekhar movie come in ott and satya movie trailer interesting arj
Author
First Published May 6, 2024, 11:26 PM IST

ఇటీవల డబ్బింగ్‌ చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. మలయాళ చిత్రాల హవా సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తమిళ చిత్రం తెలుగులోకి రాబోతుంది. అక్కడ సక్సెస్‌ అయిన `రంగోలి` మూవీని తెలుగులో `సత్య`గా తీసుకొస్తున్నారు ప్రముఖ జర్నలిస్ట్ నుంచి నిర్మాతగా మారిన శివ మల్లాల. ఈ మూవీ ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. ప్రముఖ దర్శకులు కృష్ణ చైతన్య, సతీష్‌ వేగేశ్న, శశికిరణ్‌ తిక్క, పవన్‌ సాధినేని, మధుర శ్రీధర్‌ పాల్గొని ట్రైలర్‌ని ఆవిష్కరించారు. 

ప్రభుత్వ స్కూల్‌లో చదువుకునే సత్య.. స్కూల్‌లో గ్రౌండ్‌ కోసం గేమ్‌ ఆడాల్సి వస్తుంది. మరోవైపు స్కూల్‌లో గొడవులు జరుగుతుంటాయి. అదే సమయంలో అమ్మాయితో ప్రేమలోనూ పడతాడు సత్య. ఓ వైపు గొడవలు, మరోవైపు ప్రేమ వెరసి ఈ విషయాలు తెలిసిన పేరెంట్స్ తమకు ప్రైవేట్‌ స్కూల్స్ లో జాయిన్‌ చేయించే స్థోమత లేకున్నా, అప్పుడు చేసి కార్పొరేట్‌ స్కూల్స్ లో జాయిన్‌ చేయించారు. మరి ఎందుకు అలా చేయించాల్సి వచ్చింది, స్కూల్‌ గొడవలేంటి? స్కూల్ అమ్మాయితో తన ప్రేమ ఏ తీరం చేరిందనేది సినిమా కథగా ఉండబోతుందని తెలుస్తుంది. ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. 

సినిమా గురించి నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ, మధ్యతరగతి ఫ్యామిలీ కష్టాలను, స్కూల్‌ ఫీజుల బాధలను, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ని ఇందులో చూపించబోతున్నామని, అది మన తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందన్నారు. తాను నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నానని ఎంకరేజ్‌ చేస్తున్న సినీ ప్రముఖులు, మీడియాకి ధన్యవాదాలు తెలిపారు శివ. కంటెంట్‌ కంటెంట్‌ ఉన్న చిత్రమిది అన్నారు. 10న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకున్నారు. వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హమరేష్‌, ప్రార్థన జంటగా నటించారు. 

డైరెక్ట్ గా ఓటీటీలో శివానీ రాజశేఖర్‌ మూవీ `విద్య వాసుల అహం`..

హీరో రాజశేఖర్‌ తనయ శివానీ రాజశేఖర్‌ నటించిన సినిమాలన్నీ ఓటీటీలోనే వస్తున్నారు. చివరగా ఆమె చేసిన `కోట బొమ్మాళి పీఎస్‌` మాత్రం థియేటర్లలోకి వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు మరో సినిమా డైరెక్ట్ ఓటీటీలోనే రాబోతుంది. `కోట బొమ్మాళి` జోడీ రాహుల్‌ విజయ్‌తో కలిసి ప్రస్తుతం శివాజీ `విద్య వాసుల అహం` చిత్రంలో నటిస్తుంది. మణికాంత్‌ గెలి దర్శకత్వంలో ఎటర్నిటీ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌లో మహేష్‌ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ `ఆహా`లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. 

కొత్తగా పెళ్ళైన కపుల్ డ్రామాలు తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ రానుంది.  రాహుల్ విజయ్ వాసు గా, శివాని రాజా శేఖర్ విద్య పాత్రలో భార్య భర్తలు అని పోస్టర్ లో తెలుస్తుంది. టైటిల్ లో కూడా వివాహం అనేది హైలైట్ అయ్యేలా ఉంది. ట్యాగ్ లైన్ ‘ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ ‘ అని ఉంది.  ఈ మోడ్రన్ డేస్ లో పెళ్ళైన కూపుల్ మధ్యన ప్రేమతో పాటు ఈగో కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది. పోస్టర్ లో చూస్తుంటే భార్య భర్తలు ఇద్దరూ వారీ వివాహ బంధంలో వచ్చే ఈగోలని టిట్ ఫర్ టాట్ గా ప్రయోగిస్తూ ఉంటారు అన్నట్టు అర్థమౌతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios