హైద‌రాబాద్ ను బెబ్బ‌కొట్టిన సూర్య‌కుమార్ సెంచ‌రీ.. స‌న్ రైజ‌ర్స్ పై ముంబై గెలుపు

MI vs SRH: సూర్యకుమార్ యాద‌వ్ సూప‌ర్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. బౌలింగ్ తో హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లాలు రాణించ‌డం, బ్యాటింగ్ లో సూర్య‌, తిల‌క్ వ‌ర్మ‌లు దుమ్మురేప‌డంతో ముంబై చేతిలో హైద‌రాబాద్ చిత్త‌గా ఓడింది.
 

Suryakumar Yadav's century that thrashed Hyderabad.. Mumbai's win over Sunrisers IPL 2024 RMA

MI vs SRH - IPL 2024:  ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ వ‌రుస ఓట‌ముల‌తో దాదాపు ప్లేఆప్ రేసు నుంచి అసాధ్య‌మైన స్థితిలోకి జారుకున్న త‌రుణంలో వాంఖ‌డేలో జ‌రిగిన తాజా మ్యాచ్ లో హైద‌రాబాద్ ను చిత్తుగా ఓడించి ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి నుంచి రెండో ప్లేస్ లోకి వ‌చ్చింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 55వ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్-ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ టీమ్ ను ముంబై బౌలింగ్ అటాక్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు ప్లేఆప్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత ముంబై జ‌ట్టు హైదరాబాద్ టీమ్ ను దెబ్బ‌కొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

సొంతగడ్డపై  ఓడించి హైదరాబాద్‌కు ప్లేఆఫ్ కష్టాలను  హార్దిక్ పాండ్యా జట్టు పెంచింది. ఈ మ్యాచ్‌లో సూప‌ర్ సెంచ‌రీతో చెల‌రేగిన సూర్యకుమార్ యాదవ్, మ‌రోసారి మంచి ఇన్నింగ్స్ ఆడిన‌ తిలక్ వర్మలు హీరోలుగా నిలిచారు. ఆరంభంలో త‌డ‌బ‌డుతూ ముంబై కేవలం 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన త‌రుణంలో క్రీజులోకి వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ‌లు జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

హార్దిక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు... 

ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. హైద‌రాబాద్ కు ఓపెనర్ ట్రావిస్ హెడ్ 48 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. కానీ ముంబై బౌలర్లు పట్టు బిగించారు. ట్రావిస్ హెడ్ ను పెవిలియ‌న్ కు పంపిన త‌ర్వాత టాప్ ఆర్డర్ నుండి మిడిల్ ఆర్డర్ వరకు బిగ్ ప్లేయ‌ర్లు అంద‌రూ వ‌రుస‌గా ఔట్ అయ్యారు. అయితే, 9వ స్థానంలో బ్యాటింగ్ కు వ‌చ్చిన కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ చివ‌ర‌లో 35 ప‌రుగుల‌తో మెరుపులు మెరిపించ‌డంతో  హైద‌రాబాద్ 173 పరుగులు చేసింది.

సూర్యకుమార్ యాద‌వ్ సెంచరీ.. 

ముంబై జట్టు కేవలం 31 పరుగుల స్కోరు వద్ద ముగ్గురు ముఖ్యమైన బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. 51 బంతుల్లో 102 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో తిలక్ వర్మ అతనికి మద్దతుగా నిలిచాడు, అతను 37 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి  సూప‌ర్ బ్యాటింగ్ కారణంగా మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ముంబై వైపు నుంచి కూడా అద్భుతమైన బౌలింగ్ కనిపించింది. 

హార్దిక్ బౌలింగ్‌లో మెరిశాడు

టీ20 ప్రపంచకప్‌కు ముందు హార్దిక్ పాండ్యా నుంచి మంచి బౌలింగ్ ఇన్నింగ్స్ ను ఆశించారు.  హార్దిక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి ఫామ్‌లో కనిపించడం లేదు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. హార్దిక్‌తో పాటు పీయూష్ చావ్లా కూడా ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను పెవిలియ‌న్ కు పంపాడు. బుమ్రా, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ తీశారు. ఈ ఓటమి తర్వాత హైదరాబాద్‌కు ప్లేఆఫ్‌ కష్టాలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు జట్టుకు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై అనే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, ఇతర జట్ల ఓటమిపై కూడా జట్టు ఆధారపడవలసి ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios