హుజుర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించి నల్గొండలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుజుర్‌నగర్‌ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్ధిగా సైదిరెడ్డిని కార్యకర్తలకు పరిచయం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సైదిరెడ్డి చెమటలు పట్టించి గెలిచినంత పనిచేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ట్రక్కు గుర్తు లేకపోయుంటే ఉత్తమ్‌కు ఓటమి తప్పేది కాదన్నారు.

ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ గెలిచినా జనానికి ఒరేగేది లేదని.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి హుజుర్‌నగర్‌లో ఓటమి తప్పదని కేటీఆర్ తేల్చి చెప్పారు. సైదిరెడ్డి విజయం సాధిస్తే హుజుర్‌నగర్‌కు సంబంధించిన సమస్యలను జగదీశ్‌రెడ్డికో లేదంటే తన వద్దకో తీసుకొస్తారన్నారు.

ఐదేళ్ల కాలంలో నల్గొండ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించి పాలనను పరుగులు పెట్టిస్తున్నామని, కొత్త రెవెన్యూ డివిజన్లు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు.

త్వరలో అధికారంలోకి వచ్చేది మేమేనంటూ బీజేపీ ఎగిరిపడుతోందని.. అయితే ఎవరి స్థానమేంటో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి తెలిపారు.

కోదాడలో పోటీ చేసిన సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.3 కోట్లను ప్రజలకు పంచేందుకు వెళుతూ.. దొరికిపోతాననే భయంతో ఇన్నోవా కారును తగులబెట్టుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.  

సంబంధిత వార్తలు

హుజూర్‌నగర్ బై పోల్: పోటీకి బీజేపీ సై

ఉత్తమ్ వ్యూహం: ఎల్ రమణకు ఫోన్, మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్

హుజూర్ నగర్ ఉపఎన్నిక: అన్ని పార్టీలకు అత్యంత కీలకం ఎందుకంటే ...(వీడియో)

ఉత్తమ్ సతీమణి గెలుపు తథ్యం, స్టార్ల ప్రచారం అవసరం లేదు: జగ్గారెడ్డి

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ

హుజూర్ నగర్ కలకలం: తెలంగాణ కాంగ్రెసులో రేవంత్ రెడ్డి ఏకాకి