హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ ఇప్పుడు హుజూర్ నగర్ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. హుజూర్ నగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు ఎన్నికలపోరును స్టార్ట్ చేశాయి. 

ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తే మిగిలిన పార్టీలు ఖరారు చేసే పనిలో పడ్డాయి. గత ఎన్నికల్లో పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమిపాలైన శానంపూడి సైదిరెడ్డిని టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. 

హుజూర్ నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణిని బరిలోకి దించితే గెలుపు తథ్యమని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి పట్టు ఉందని చెప్పుకొచ్చారు. 

ఐదుసార్లు హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ గెలుపొందారని ఈ నేపథ్యంలో ఆయన సతీమణికి టికెట్ ఇస్తే గెలుపు తథ్యమని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఎన్నికల ప్రచారానికి స్టార్లు పోవాల్సిన పనిలేదన్నారు జగ్గారెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు ప్రచారం చేస్తే పార్టీ గెలుపు తథ్యమన్నారు. 

టీఆర్ఎస్, కేసీఆర్ నిరంకుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రానికే ఒక మార్గనిర్దేశకంగా ఉండాలని జగ్గారెడ్డి ప్రజలను కోరారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని కోరారు. 

ఈ వార్తలు కూడా చదవండి

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ