హుజూర్ నగర్ ఉపఎన్నిక: అన్ని పార్టీలకు అత్యంత కీలకం ఎందుకంటే ...(వీడియో)
తెలంగాణలోని హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం కూడా ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీనితో హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది.
తెలంగాణలోని హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం కూడా ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీనితో హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. నోటిఫికేషన్ కూడా విడుదలవడంతో అన్ని పార్టీలకు చెందిన ఆశావాహులు తమ పార్టీ అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తన సతీమణి పద్మావతి పోటీ చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏకపక్షంగా ఇలా ఎలా ప్రకటిస్తారంటూ రేవంత్ రెడ్డి బాహాటంగానే ఈ చర్యను ఖండించిన విషయం తెలిసిందే.