హుజూర్‌నగర్: హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  పోటీ చేసేందుకు బీజేపీ రంగం సిద్దం చేసుకొంటుంది. 2023 నాటికి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు లిట్మస్ టెస్ట్ లాంటివని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పద్మావతి పేరును ఖరారు చేశారు. ఎఐసీసీ ఈ పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానంలో బీజేపీ కూడ పోటీ చేయాలని ప్లాన్ చేస్తోంది. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హుజూర్‌నగర్ అభ్యర్థిగా భాగ్యారెడ్డిని బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి భాగ్యారెడ్డికి 1555 ఓట్లు వచ్చాయి. నోటాకు 1621 ఓట్లు వచ్చాయి. నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీ అభ్యర్ధికి దక్కాయి.

2018 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటితో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయపరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. పలు పార్టీల నుండి బీజేపీలో వలసలు పెరిగాయి.ఈ తరుణంలో బీజేపీ నేతలు తమ పార్టీకి ఈ ఎన్నికల్లో మెరుగైన ఓట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కాంగ్రెస్ కంటే తమనుప్రత్యామ్యాయంగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని  ఆ పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. ఈ ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేస్తోంది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన భాగ్యారెడ్డికే టిక్కెట్టు ఇస్తారా.... మరో అభ్యర్దిని బరిలో దింపుతారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

ఉత్తమ్ వ్యూహం: ఎల్ రమణకు ఫోన్, మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్

హుజూర్ నగర్ ఉపఎన్నిక: అన్ని పార్టీలకు అత్యంత కీలకం ఎందుకంటే ...(వీడియో)

ఉత్తమ్ సతీమణి గెలుపు తథ్యం, స్టార్ల ప్రచారం అవసరం లేదు: జగ్గారెడ్డి

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ