హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తిరిగి పాగా వేయాలని ఉత్తమ్ ప్లాన్ లు వేస్తున్నారు. 

అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల ప్రచారంను ప్రారంభించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర పార్టీల మద్దతు కోరడంలోనూ ముందంజలోనే ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైతే టీడీపీ,వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అదే పంథాలో నడవాలను నిర్ణయించుకుంది.

అందులో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు సహకరించాలని ఫోన్ లో కోరారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఎల్ రమణ అన్నట్లు సమాచారం. రెండు రోజుల్లో పార్టీ తరపున సమాధానం చెప్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నట్లు సమాచారం. 
 

ఈ వార్తలు కూడా చదవండి

హుజూర్ నగర్ ఉపఎన్నిక: అన్ని పార్టీలకు అత్యంత కీలకం ఎందుకంటే ...(వీడియో)

ఉత్తమ్ సతీమణి గెలుపు తథ్యం, స్టార్ల ప్రచారం అవసరం లేదు: జగ్గారెడ్డి

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ